కరోనా కారణంగా ఐపీఎల్ మరియు ఇతర ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లన్ని ఆగిపోవడంతో బారత్ ప్లేయర్స్ అందరూ తమ చేతులకు పని చెబుతూ బిజీగా ఉన్నారు.కాని  టీమిండియా ఓపెనర్, వైస్ క్యాపిటన్ రోహిత్ శర్మ మాత్రం వరుసగా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్  చేస్తూ లైవ్ లలో పాల్గొంటూ ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో ఒక రొమాంటిక్ ఫోటో తో పాటు ‘ మీరు ప్రేమించే దానిని ఎప్పుడూ పట్టుకునే ఉండండి’ అనే క్యాప్షన్ ను పోస్ట్ చేశాడు.మన రోహిత్ శర్మ భార్య పై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఇలాంటి పోస్టును పెట్టాడు.

ఎప్పుడు రోహిత్ శర్మ పై పంచ్ లు వేసే మన యువరాజ్ సింగ్ వెంటనే ఈ పోస్ట్ పై స్పందించాడు. ‘రోహిత్‌.. నీ బుగ్గలు అంటే నాకు ఇష్టం.. వాటిని పట్టుకోనా’ అని రోహిత్ ను టీజ్ చేశాడు.దీనికి రోహిత్ అభిమానులలో ఒకరు ముందు రితికా పర్మిషన్‌ తీసుకోవాలంటూ యువరాజ్ కు రిప్లై ఇచ్చాడు.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఒకరిని ఒకరు టీజ్ చేసుకుంటూ టీజింగ్ వార్ ను మొదలుపెట్టిన రోహిత్ శర్మ, యువీ ఇంకా దీన్ని కొనసాగిస్తున్నారు.వీరిద్దరూ ఒకరి పై ఒకరూ చేస్తున్న కామెడీ క్రికెట్ ఫ్యాన్స్ ను లాక్ డౌన్ సమయంలో ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రస్తుతం యువరాజ్ చేసిన కామెంట్స్ పై రోహిత్ శర్మ ఎలాంటి కౌంటర్ వేస్తారో అని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.