2024.. జగనన్న వన్స్ మోర్.. కూత పెట్టి కబడ్డి ఆడిన మంత్రి రోజా!

2024.. జగనన్న వన్స్ మోర్.. కూత పెట్టి కబడ్డి ఆడిన మంత్రి రోజా!

by Harika

Ads

ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ముగింపు సందర్భంగా మంత్రి రోజా కబడ్డీ ఆడి అందరినీ కనువిందు చేసింది. అంతకంటే ఎక్కువగా ఆమె పెట్టిన కూత అందరిని ఆకర్షించింది. 2024.. జగనన్న వన్స్ మోర్ అంటూ కూత పెట్టి రోజూ బరిలోకి దిగితే అందరూ హర్షద్వానాలతో మంత్రి రోజాను ఎంకరేజ్ చేశారు. మామూలుగానే రోజా సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని.

Video Advertisement

అవకాశం వచ్చిన ప్రతిసారి తన అభిమానాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది రోజా. అయితే కబడ్డీ బరిలో దిగిన మంత్రి రోజా కబడ్డీ కబడ్డీ అని కూత పెట్టకుండా 2024.. జగనన్న వన్స్ మోర్ అంటూ కూత పెట్టారు. అనంతరం కూతకు వచ్చిన ప్రత్యర్ది ని క్యాచ్ పట్టి మురిసిపోయారు. మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి కాలెత్తి లెగ్ టచ్ కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా షర్మిల టైంపాస్ రాజకీయాలు చేస్తోందంటూ షర్మిల పై ఫైర్ అయ్యారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్టేఅని చురక అంటించారు. వైయస్సార్ పంచలు ఊడదీసి కొడతా అన్నా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పెళ్ళికి ఆహ్వానించి వచ్చిందని ఆగ్రహించారు. టీడీపీ కోవర్ట్ అన్న రేవంత్ రెడ్డి తో ఏ మొహం పెట్టుకొని పొత్తు పెట్టుకున్నారు అని ఫైర్ అయ్యారు.

ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయటం, విమర్శలు చేయడం తప్పితే ఏం చేస్తుంది అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు రోజా. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభంలో కూడా రోజా కబడ్డీ ఆడి ప్లేయర్లందరినీ ఉత్సాహపరిచారు రోజా అప్పుడు కూడా వెరైటీగా కోత పెడుతూ చెట్టు మీద కొంగ.. చంద్రబాబు దొంగ అంటూ కూతకు వెళ్ళటం జరిగింది. ఆరోజు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.


End of Article

You may also like