క్వారెంటైన్ సెంటర్ లో అతని తీరు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.! ఏం చేసారంటే?

క్వారెంటైన్ సెంటర్ లో అతని తీరు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.! ఏం చేసారంటే?

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో కరోనా సోకినా వ్యక్తులను ఐసొలేషన్ వార్డ్ లలో చికిత్స అందిస్తుండగా కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ సెంటర్స్ లో నిర్బంధిస్తున్నారు.అయితే క్వారంటైన్ సెంటర్స్ లో ఉన్నవారికి ప్రభుత్వమే ఆహారం అందిస్తుంది.కాగా బీహార్ లోని ఓ క్వారంటైన్ సెంటర్ లో ఓ వ్యక్తి పది మందికి సరిపోయే ఆహారాన్ని ఒక్కడే తింటున్నాడు.దీంతో ఈ వార్త అంతటా వైరల్ గా మారింది ..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉంటుంది అని మనకు తెలుసు.అయితే అది ఎంతవరుకు అంటే ఇద్దరు వ్యక్తులు తినే ఆహారం ఒక వ్యక్తి తినడం వరకు.అయితే రాజస్థాన్ నుండి బీహార్ కూలి పని చేసుకోవడానికి వచ్చిన అనూప్ ఓజా అనే 23 యేళ్ళ వలస కార్మికుడిని కరోనా కారణంగా క్వారంటైన్ సెంటర్ లో నిర్బంధించారు.అయితే ప్రతిరోజు ఉదయాన్నే 35 చపాతీలు మరియు మధ్యాహ్నం ,సాయంత్రం 10 ప్లేట్ ల అన్నాన్ని తింటున్నాడు ఓజా .మొదటగా అక్కడ ఉన్న అధికారులు ఓజా తిండిని చూసి ఆశ్చర్యపోయారు.తర్వాత ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు.

కానీ ఈ విషయాన్ని మొదటగా నమ్మలేని ఉన్నతాధికారులు తర్వాత స్వయంగా వచ్చి ఓజా తిండిని చూసి నివ్వెరపోయారు.అయితే క్వారంటైన్ సెంటర్స్ లో సగటు మనిషికి రోజుకి ఎంత ఆహారం అందించాలి అని కొన్ని షరతులు ఉంటాయి.కాగా ఓజా విషయంలో కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్న అధికారులు ఓజా కు సరిపోయినంత ఆహారం అందించాల్సిందిగా అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు .


End of Article

You may also like