Ads
తాజాగా రానా దగ్గుబాటి తాను ఎస్ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దీంతో వెంటనే ఈ వార్త వైరల్ అయ్యి రానా బ్యాచిలర్ లైఫ్ నుండి దూరం అవుతున్నారంటూ నెట్ లో తెగ ట్రోల్ల్స్ చేసారు.రానా పెళ్లిచేసుకోబోతుంది మిహిక బజాజ్ అనే అమ్మాయిని.మిహిక బజాజ్ చాలా ధనవంతురాలైన అమ్మాయి.మిహిక తండ్రికి క్షలా అనే ప్రముఖ జ్యుయలరీ తయారీ సంస్థ ఉంది.అలాగే మిహిక బజాజ్ తల్లి దేశంలో ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్.అయితే ఇప్పుడు రానా ,మిహిక కు ఎంగేజ్మెంట్ అయింది.ఈ వార్తను రానా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అఫీషయల్ గా అనౌన్స్ చేసారు.
Video Advertisement
అయితే అందరికి కూడా వారికీ ఎంగేజ్మెంట్ అయ్యిందా లేదా ఏదైనా ఫంక్షన్ జరిగిందా అని డౌట్ వస్తుంది.అదే డౌట్ హీరో నానికి కూడా వచ్చింది.వాట్సాప్ లో నాని కూడా రానా ను ఇదే ప్రశ్న అడిగారు.దానికి రానా రోక ఫంక్షన్ అని రిప్లై ఇచ్చారు.అయితే నేను గూగుల్ లో సెర్చ్ చేస్తాను లే అని నాని రిప్లై ఇచ్చారు.కాగా రోక ఫంక్షన్ అంటే ఏంటి అని అందరూ ఇప్పుడు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.అసలు రోక ఫంక్షన్ అంటే ఏంటో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
రోక ఫంక్షన్ అంటే ఏంటి?
రోక ఫంక్షన్ అంటే పెళ్ళికి ముందు…. ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి ,పెళ్లి ఏ ముహర్తములో చేసుకోవాలి,ఎవరిని పెళ్లి పెద్దలుగా పిలవాలి,భోజనాల ఏర్పాట్లు ,ఏ ప్రదేశములో వివాహం జరిపించాలని ఇంకా ఇతర ఆచారాలను పాటించడానికి పండితుల సమక్షంలో పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు..ఆ సమయంలో విందు కూడా ఏర్పాటు చేసుకొని పువ్వలతో అలంకరించి ఫంక్షన్ చేస్తారు దీనినే రోక ఫంక్షన్ అంటారు.
ఈ ఆచారం ఎక్కువగా నార్త్ ఇండియాలో కనిపిస్తుంది.అయితే ఇప్పుడు రానా రోక ఫంక్షన్ లో వైట్ దోతి వేసుకున్నారు ,మిహిక సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్నారు.కాగా వీరిద్దరి మ్యారేజ్ డిసెంబర్ లో ఉండబోతుంది అని సురేష్ బాబు తెలిపారు.రోక ఫంక్షన్ అనేది పెళ్లి కూతురి ఇంటి దగ్గర అయినా లేదా ఇరు కుటుంబాలకు నచ్చిన ఏదైనా ప్రదేశంలో చేసుకోవచ్చు.అయితే వీరి రోక ఫంక్షన్ రామానాయుడు స్టూడియోస్ లో జరగడం విశేషం.
End of Article