రొట్టె కొనుక్కోడానికి వెళ్ళాడు…రెండు లక్షల ఫైన్ వేశారు.!! అసలేమైంది?

రొట్టె కొనుక్కోడానికి వెళ్ళాడు…రెండు లక్షల ఫైన్ వేశారు.!! అసలేమైంది?

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.రోజు రోజుకి పాజిటివ్ కేసు లు నమోదు కావడంతో పాటు వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి.దీంతో అన్ని దేశాలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.అన్ని రవాణా మార్గాలు నిలిపి వేశారు.దీంతో ఇతర దేశాలలో చాలామంది చిక్కుకుపోయారు.చనిపోయిన వారిని ఆఖరిసారి చూసుకునే అవకాశం కూడా లేకపోయింది.ఇలాంటి ఎన్నో విషాద సంఘటనలను మిగిల్చింది ఈ కరోనా వైరస్.

Video Advertisement

ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిద్దామని కొన్ని నెలల క్రితం సౌదీ వెళ్లారు.కానీ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగం ఏది కుదరకా దాదాపు ఆరు నెలల నుండి అక్కడే ఉంటున్నారు.తాజాగా కరోనా వలన సౌదీ లో కూడా లాక్ డౌన్ విధించారు.కాగా రొట్టె కొనుకుందామని రోడ్ మీదకి వచ్చారు శ్రీనివాస్ .ఆ సమయంలో సౌదీ పోలీసులు శ్రీనివాస్ ను పట్టుకుని భారీగా జరిమానా విధించారు.

ఎంత జరిమానా అంటే మన ఇండియా డబ్బులో దాదాపు రెండు లక్షల రూపాయలు.అప్పుడు శ్రీనివాస్ తన పరిస్థితిని పోలీసులకు విన్నవించుకున్నాడు.కానీ లాభం లేకపోయింది.కాగా తనకి సహాయం చేసి ఈ సమస్యను పరిష్కరించి తనను ఆ దేశం నుండి బయటకు తీసుకురావాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరుతున్నారు శ్రీనివాస్.ఈ ఘటనపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.శ్రీనివాస్ ను ఎలా అయినా సౌదీ నుండి  తీసుకురావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు .


End of Article

You may also like