2023 రౌండ్ అప్..! హిట్ అయిన సినిమాలు ఏవి… ఫ్లాప్ అయిన సినిమాలు ఏవంటే..?

2023 రౌండ్ అప్..! హిట్ అయిన సినిమాలు ఏవి… ఫ్లాప్ అయిన సినిమాలు ఏవంటే..?

by Mounika Singaluri

Ads

మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరం ముగిసిపోయి 2024 సంవత్సరం వస్తుంది. కొత్త ఏడాది అందరి జీవితంలో కొత్తగా ఉంది అనుకుంటూ ఉంటారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కూడా కొత్త సంవత్సరం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంది. అయితే 2023 సంవత్సరంలో టాలీవుడ్ కి ఎంత కలిసి వచ్చింది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే….!

Video Advertisement

2023 ఇయర్ స్టార్టింగే టాలీవుడ్ కి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల రూపంలో రెండు హిట్స్ వచ్చాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాల్లో వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ అందుకోగా వీరసింహారెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. అదే సంక్రాంతి సీజన్ లో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ వారసుడు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది.

common points between mahesh babu trivikram movie and veera simha reddy

జనవరి చివరి వారంలో వచ్చిన బాలీవుడ్ మూవీ పఠాన్ కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక ఫిబ్రవరిలో సుమారు 16 కు పైగా సినిమాలు విడుదలయితే అందులో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోగా ఒక సినిమా హిట్ గా నిలిచింది. కలర్ ఫోటో హీరో సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ ఫిబ్రవరి స్టార్టింగ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ చేసిన స్ట్రైట్ తెలుగు ఫిలిమ్ సార్ 100 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Balagam movie review

ఇదే నెలలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మార్చిలో 15 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో కేవలం మూడు మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందులో జబర్దస్త్ వేణు తెరకెక్కించిన బలగం ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బలగం తర్వాత విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఏప్రిల్ నెలలో సుమారు పది సినిమాలు రిలీజ్ అయితే అందులో సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోగా అఖిల్ నటించిన ఏజెంట్, సమంత శాకుంతలం సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి. ఇక మే నెలలో గోపీచంద్ రామబాణం, అల్లరి నరేష్ ఉగ్రం, నాగచైతన్య కస్టడీ సినిమాలు ప్లాప్స్ అవ్వగా, విజయ్ ఆంటోని నటించిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు 2 హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మేం ఫేమస్ అనే చిన్న సినిమా కూడా హిట్ అయింది.

వీటితోపాటు 2018 అనే మలయాళ డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది. ఇక జూన్ నెలలో 15 పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఆ నెలలో భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ డిజాస్టర్ గా నిలిచింది. జూలై లో దాదాపు అన్ని చిన్న సినిమాలే విడుదలయ్యాయి.

ఈ నెలలో సుమారు 17 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే నెలలో వచ్చిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల మెగా మల్టీ స్టారర్ బ్రో బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది. ఆగస్ట్ నెలలో రజినీకాంత్, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ పోటీ పడ్డారు. ఈ ఇద్దరిలో రజనీకాంత్ జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకోగా చిరంజీవి భోలా శంకర్ తో డిజాస్టర్ మూటగట్టుకున్నారు.

miss shetty mr polishetty movie review

ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో కొన్ని పెద్ద సినిమాలు కొన్ని మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బ్లాక్ బస్టర్ అవ్వగా బాలీవుడ్ డబ్బింగ్ మూవీ జవాన్ తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్ తో హిట్ గా నిలిచింది. భారీ అంచనాలతో వచ్చిన ఖుషి యావరేజ్ గా నిలిచింది. ఇదే నెలలో వచ్చిన స్కంద ప్లాప్ అయింది. ఇక దసరా సీజన్ అంటే అక్టోబర్ నెలలో చూసుకుంటే దసరా కంటే ముందు రిలీజ్ అయిన సినిమాల్లో మ్యాడ్ సూపర్ హిట్ అయింది.

ఇక దసరాకి రిలీజ్ అయిన సినిమాల్లో లియో, భగవంత్ కేసరి సక్సెస్ అవ్వగా, రవితేజ టైగర్ నాగేశ్వరరావు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. నవంబర్ నెలలో సుమారు 20 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో పొలిమేర 2 మాత్రమే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. నవంబర్ ఎండింగ్ లో వచ్చిన కోటబొమ్మాలి పిఎస్ డీసెంట్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ అయింది. ఇక ఇదే నెలలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన కీడా కోలా, జపాన్, ఆది కేశవ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి.ఇక అజయ్ భూపతి మంగళవారం సినిమా మాత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.

Animal movie review

ఇక డిసెంబర్ నెలలో 10 సినిమాలు రిలీజ్ అయితే ఇప్పటివరకు మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. డిసెంబర్ 1న రిలీజ్ అయిన యానిమల్ , హాయ్ నాన్న సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. డిసెంబర్ లాస్ట్ వీకెండ్ కళ్యాణ్ రామ్ డెవిల్, రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు ఫుల్ రన్ లో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాయో వేచి చూడాలి.

minus point in hi nanna teaser

ఓవరాల్ గా చూస్తే 2023 సంవత్సరంలో చిన్న, పెద్ద, డబ్బింగ్ సినిమాలన్నీ కలుపుకొని సుమారు 170 కి పైగా సినిమాలు రిలీజ్ అయితే వాటిలో సగం సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా లాభాలు అందించలేదు. ప్రతీ ఏడాది సక్సెస్ రేటు 20% శాతం కూడా ఉండడం లేదు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఈ జనరేషన్ స్టార్స్ లో ఒక్క ప్రభాస్ నుంచి మాత్రమే ఈ ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. ఫైనల్ గా చూస్తే ఈ ఏడాది టాలీవుడ్ కి లాభాలు కంటే నష్టాలు ఎక్కువగా మిగిలింది


End of Article

You may also like