Home Filmy Adda “రౌడీ బాయ్స్”లో ఈ సీన్ కాపీనా..? ఏ సినిమా నుండి అంటే..?

“రౌడీ బాయ్స్”లో ఈ సీన్ కాపీనా..? ఏ సినిమా నుండి అంటే..?

by Mohana Priya

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసం ఆశిష్ చాలా కష్టపడినట్లు తెలిసిపోతోంది. డాన్స్ విషయంలో కానీ, యాక్షన్ విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకున్నారు. అక్షయ్ పాత్ర ఆశిష్ కి సూట్ అయ్యింది.

మళ్లీ చాలా రోజుల తర్వాత అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించారు. అనుపమ మేకోవర్ కూడా పాత్రకి తగ్గట్టుగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ గొడవలు తప్ప మిగిలిన విషయాలు ఏవీ పెద్దగా చూపించరు.

rowdy boys movie review

కేవలం ఆ ఒక్క విషయంపై మాత్రమే ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంది. అయితే, ఈ సినిమాలో ఒక సీన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే, హీరో వేరే కాలేజ్ వాళ్ళతో గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు, “మీ కాలేజ్ లో అమ్మాయిలు లేరా ఇక్కడికి వచ్చారు?” అని అంటారు. అప్పుడు హీరో, “మా కాలేజ్ లో అమ్మాయిలు లేక కాదు. మీ కాలేజ్ లో మగవాళ్ళు లేరు. అందుకే వచ్చాం” అని చెప్తారు.

Actors who wore lungi in movies

ఇదే సీన్ అంతకుముందు ఇంకొక సినిమాలో కూడా ఉంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో పూజా హెగ్డే ఎపిసోడ్ టైంలో విలన్ వాళ్ళు, “మీ ఏరియాలో ఆడవాళ్లు లేరా?” అని అడిగితే అందుకు హీరో, “కాదు మీ ఏరియాలో మగవాళ్ళు లేరు అంటే వచ్చాం” అని అంటారు. రౌడీ బాయ్స్ సినిమాలో సీన్ కూడా దాదాపు ఇలాగే ఉంది. ప్రస్తుతం ఈ సీన్ వైరల్ అవుతోంది.

watch video :

https://youtu.be/Dt2blBa7ot4

You may also like