Ads
ఇటీవలే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం నాడు హైదరాబాద్ లో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైన బైక్ డ్రైవ్ చేస్తుండగా రోడ్డు పైన ఉన్న ఇసుక కారణంగానే స్కిడ్ అయి పడిపోయారని చెబుతున్నారు. ఈ విషయం లో అరబిందో కంస్ట్రక్షన్ కంపెనీ కి GHMC వారు లక్ష రూపాయల ఫైన్ కూడా విధించారు. ఈ సందర్బంగా ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ గారు పెట్టిన పోస్ట్ పైన కొందరు విమర్శలు చేసారు. మీరు సెలబ్రెటీలకు మాత్రమే స్పందిస్తారా ? సామాన్యులు మీకు పట్టారా అంటూ ప్రశించించారు
Video Advertisement
ఈ సందర్బంగా ఆయన ఒక పోస్ట్ ద్వారా అందరికి సమాధానం ఇచ్చారు ఏంటంటే ” సాయిధరమ్ ఆక్సిడెంట్ విషయంలో రోడ్డుపైన ఇసుక పేరుకు పోవటానికి కారణమైన Aurobindo construction company పై GHMC లక్ష రూపాయలు ఫైన్ వేసింది. ఆరోజు నేను పోస్టు పెట్టినప్పుడు 80% నన్ను అర్థం చేసుకున్నారు. 20% ట్రోల్ చేశారు కూడా. అసలు అక్కడ ఇసుక లెనేలేదని కొందరు వాదించారు.
ముఖ్యంగా ఎక్కువమంది సెలెబ్రిటీకి జరిగినప్పుడు రియాక్ట్ అయ్యే నువ్వు సామాన్యులకు అయ్యినప్పుఫు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని అడిగారు.
ముందుగా అందరికీ చెప్పాలనుకునేది ఏమిటంటే నా వాల్ న్యూస్ ఛానల్ కాదు. రోజూ కొన్ని వందల accidentలు జరుగుతుంటాయి.
నేను పెట్టిన post common manకి మంచి జరగాలి అని పెట్టాను అని అర్ధం చేసుకోలేని మేధావులకు నేను ఏమీ చెప్పలేను. ఒక సెలబ్రిటీ కి జరిగిన ఇన్సిడెంట్ వల్ల అందరి attention focus అవుతుంది. అప్పుడు road inconvenience కి కారణమైన ఆ construction కంపెనీ పై action తీసుకుంటే…. అది న్యూస్ అవుతుంది. మిగతా construction companies ఒళ్లు దగ్గర పెట్టుకుని రోడ్డుపై అసౌకర్యం లేకుండా జాగ్రత్త పడతాయి… అప్పుడు common man కి inconvenience తగ్గుతుంది accidentలు కూడా తగ్గుతాయి.
నా పోస్టుని పూర్తిగా చదవకుండా అర్ధం చేసుకోకుండా ఏక వచనంతో సంబోధిస్తూ రియాక్ట్ అయిన వారందరికీ ఒకటే సమాధానం. ‘I mind my own business. My concern for love and care for the society remains the same as it has been.’ అంటూ పేస్ బుక్ లో పోస్ట్ చేసారు.
End of Article