సినిమా ఘటనని తలపించే రియల్ స్టోరీ!

సినిమా ఘటనని తలపించే రియల్ స్టోరీ!

by Megha Varna

Ads

“సాబ్, రెండు రోజుల నుండి బిడ్డకి పాలు దొరకలేదు..ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రయత్నించాం అని స్టేషన్లో కనపడిన కానిస్టేబుల్ కి మొరపెట్టుకుంది ఆ తల్లి .. క్షణమాలోచించకుండా పాలకోసం వెతికాడు ఆ వ్యక్తి..చుట్టుపక్కల లేకపోవడంతో బయటికివెళ్లి వాటిని తీసుకుని వచ్చేసరికి ట్రెయిన్ బయల్దేరింది.దాంతో ఒక చేత్తో రైఫిల్ , మరో చేత్తో పాల ప్యాకెట్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి పాలప్యాకెట్..అచ్చం సినిమా కథలా అనిపించినా ఇది నిజం…

Video Advertisement

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలసకూలీల కోసం కర్ణాటకలోని బెల్గాం నుంచి గోరఖ్‌పూర్‌కు బయల్దేరింది ఒక శ్రామిక్‌ రైలు. అదే రైలులో హసీన్ హష్మి తన భార్య షరీఫ్‌ హష్మి, నాలుగేళ్ల చిన్నారితో కలిసి గోరఖ్‌పూర్‌లోని సొంతూరుకు బయల్దేరాడు. పాల కోసం నాలుగేళ్ల చిన్నారి గుక్క పట్టి ఏడుస్తున్నాడు. మధ్యలో రెండు మూడు రైల్వే స్టేషన్‌లలో రైలు ఆగినా వారికి పాలు దొరకలేదు. ట్రెయిన్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ రైల్వేస్టేషన్ కి చేరుకుంది.అక్కడే ఇందర్ సింగ్ RPF కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు..

తమ బాధని అక్కడే ఉన్న ఇందర్‌ సింగ్‌కు చెప్పి తమకు సహాయం చేయమని కోరారు. వెంటనే స్పందించిన ఇందర్‌ సింగ్‌ రైల్వే స్టేషన్‌ బయటకు పరిగెత్తి ఒక షాపులో పాలపాకెట్‌ను కొని మళ్లీ పరిగెత్తుకొచ్చాడు. కానీ అప్పటికే రైలు కదిలిపోయింది. కానీ ఇందర్‌ సింగ్‌ మాత్రం ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా రైలు వెంట పరిగెడుతూ చివరికి ఎలాగోలా షరీఫ్‌ హష్మికి కిటికీలోంచి పాలపాకెట్‌ను అందించాడు.

ఒక చేత్తో రైఫిల్ ని పట్టుకుని మరో చేత్తో పాల పాకెట్ పట్టుకుని స్టేషన్ లో ట్రెయిన్ వెంట పరిగెడుతూ వెళ్లి, చివరికి కిటికిలో నుండి పాలపాకెట్ విసిరేయడం ఇదంగా రైల్వేస్టేషన్లోని సిసిటివి పుటేజ్ లో రికార్డయింది.. ఇప్పుడు ఇందర్‌ సింగ్‌ రియల్‌ హీరోగా మారిపోయాడు. సోషల్ మీడియాలో వైరలయిన ఈ వీడియోతో ఇందర్ సింగ్ ఒక్కసారిగా రియల్ హీరో అయిపోయాడు.

ఇందర్ సింగ్ నిజమైన హీరో అంటూ  కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఈ వీడియోను ట్వీట్ చేశారు.  “ ఇందర్‌ సింగ్‌ ఇవాళ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి ఆకలి తీర్చేందుకు అతను చేసిన సాహసం నిజంగా అభినందించదగ్గది. కదులుతున్నరైలు వెంబడి పరిగెడుతూ చివరికి చిన్నారి తల్లికి పాలపాకెట్‌ అందించి గొప్ప మనుసును చాటుకున్నాడు..”అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.


End of Article

You may also like