Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోల మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా కూడా ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకి ఒక హైలైట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఉన్న ఈ సీన్ కి దగ్గరగా ఉన్న ఒక సీన్ ఒక పాత సినిమాలో ఉంది. అంతే కాకుండా డైలాగ్స్ కూడా దాదాపు ఒకేలాగా ఉన్నాయి. ఈ అరెస్ట్ సీన్ కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నటించిన మంచి మిత్రులు అనే సినిమాలో హీరోలు ఇద్దరికీ వచ్చే సీన్ కి దగ్గరగా ఉంది.
ఈ సినిమాలో కూడా అలాగే శోభన్ బాబు వచ్చి కృష్ణని అరెస్ట్ చేస్తారు. అంతే కాకుండా, “నిన్ను పట్టుకోవడానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్” అని చెప్తారు. సడన్ గా సినిమాలోని ఈ సీన్ చూస్తూ ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర, జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్రని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చే సీన్ లాగా ఉంది. అక్కడ వచ్చే డైలాగ్స్ కూడా కొంచెం ఒకేలాగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
https://www.instagram.com/p/Cf6W9IIpLmy/
End of Article