Ads
సాధారణంగా రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బాహుబలి కంక్లూజన్ విడుదలయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి అవ్వబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. మొదట జూలై 2020 లో విడుదల అవుతుంది అన్నారు. కానీ 2020 ఫిబ్రవరిలో సినిమా 2021 జనవరి 8వ తేదీన విడుదల అవుతుంది అని అప్ డేట్ ఇచ్చారు.
Video Advertisement
తర్వాత కరోనా రావడం అసలు 2020లో మార్చి తర్వాత నుండి సినిమాలే విడుదల అవ్వకపోవడం. షూటింగ్ జరుగుతున్న సినిమా షూటింగ్ ఆగిపోవడం. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. ప్రతి అకేషన్ కి పోస్టర్ విడుదల చేయడం, షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం తో పాటు వాళ్ల పోస్ట్ లకి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా రిప్లై ఇస్తున్నారు.
కామెంట్ ఎంత సెటైరికల్ గా ఉంటే రిప్లై కూడా అంతే సెటైరికల్ గా ఉంటోంది. చూస్తుండగానే 2020 అయిపోయింది. 2021 మొదలయ్యి అప్పుడే 7 రోజులు గడిచిపోయాయి. గత సంవత్సరం ఆర్ఆర్ఆర్ బృందం ప్రకటించిన రిలీజ్ డేట్ కూడా రానే వచ్చింది. ఇంక సోషల్ మీడియాలో చాలామంది ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం కి గుర్తు చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఒక వ్యక్తి “ఈరోజు నైట్ కి ఆర్ఆర్ఆర్ టీం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి ప్రీమియర్స్ ఎక్కడ సెట్ చేశారు మాస్టారు? ఏపీ/టీఎస్ స్క్రీన్స్ లిస్ట్ ఎంత? యు ఎస్ స్క్రీన్స్ లిస్ట్ ఎంత? వరల్డ్ వైడ్ స్క్రీన్స్ లిస్ట్ ఎంత?” అని వెంకీ సినిమాలో బ్రహ్మానందం గారు, రవితేజ మాట్లాడుకుంటున్న టెంప్లెట్ తో సరదాగా ట్వీట్ చేశారు.
దానికి ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ అకౌంట్ టీం కూడా వెంకీ సినిమాలోని టెంప్లేట్ తోనే “అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా” అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Eroju Night ki #RRR Team & Tfi ki Premieres ekkada set chesaru masteruu @RRRMovie
Ap / Ts Screens list entha….
Us Screens list entha…
Worldwide Screens list entha… https://t.co/qzMYGVC7LG pic.twitter.com/654d77JEv3— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 7, 2021
End of Article