Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతున్నట్టు సినిమా బృందం ఇటీవల ప్రకటించింది. అన్ని పనులు పూర్తి చేసుకొని ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్టు సమాచారం. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం, ఈ సినిమా ఫైనల్ కట్ రెండు గంటల 45 నిమిషాలు ఉండబోతోంది. కరోనా కారణంగా సినిమా పలుసార్లు వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం ఇంక వాయిదా పడే అవకాశాలు లేవు అని, ఖచ్చితంగా జనవరి 2022లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీరుతుంది అని బృందం ప్రకటించింది.
End of Article