ఇదెక్కడి ఎడిట్ రా మావా..? RRR లో అంత మంచి సీన్ ని కామెడీ చేసేసారుగా..?

ఇదెక్కడి ఎడిట్ రా మావా..? RRR లో అంత మంచి సీన్ ని కామెడీ చేసేసారుగా..?

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

rrr trailer analysis and hidden details

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. ఇందులో హీరోలు ఇద్దరూ కలుసుకునే సీన్ కి పేరడీ అయిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒకతను లిక్కర్ షాప్ లో కూర్చొని మందులో కలుపుకోవడానికి నీళ్ల కోసం చూస్తూ ఉంటాడు.

rrr funny edit video goes viral

 

మరొకతను సిగరెట్ వెలిగించుకోవడానికి లైటర్ కోసం చూస్తూ ఉంటాడు. తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని కలుసుకుంటారు. అప్పుడు నీళ్ల కోసం చూస్తున్న అతనికి మరొకతనికి నీళ్లు ఇస్తాడు. సిగరెట్ వెలిగించుకోవడానికి ఇంకొక అతను లైటర్ ఇస్తాడు. ఈ వీడియోపై సినిమా ఆఫీషియల్ ట్విట్టర్ పేజ్ కూడా స్పందించింది. ఎవరో ఒక ట్విట్టర్ యూజర్ సినిమా బృందాన్ని ట్యాగ్ చేస్తూ ఈ వీడియో షేర్ చేస్తే, సినిమా బృందం ట్విట్టర్ అకౌంట్ వాళ్ళు అతడు బ్రహ్మానందం టెంప్లేట్ తో రిప్లై ఇచ్చారు.

watch video :


End of Article

You may also like