Ads
ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఇటీవల విడుదలైన దోస్తీ పాట ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటని తెలుగులో హేమచంద్ర, తమిళ్ లో అనిరుధ్ రవిచందర్, కన్నడలో యాజిన్ నిజార్, మలయాళంలో విజయ్ ఏసుదాస్, హిందీలో అమిత్ త్రివేది పాడారు. ఈ పాటలో సప్రైజ్ గా చివరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కనిపిస్తారు. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
Video Advertisement
అయితే ఈ పాట చివరిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేతులు పట్టుకుంటారు. ఇదే మనకు సినిమా పోస్టర్ లో కూడా చూపిస్తారు. అయితే ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఉంది. స్టార్ వార్స్ సినిమాలో ఇదే విధంగా చేతులు పట్టుకునే సీన్ ఉంటుంది. దాంతో బహుశా రాజమౌళి ఈ సినిమా నుండి ఈ సీన్ నుండి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారేమో అని కామెంట్స్ వస్తున్నాయి.
అయితే కొంత మంది మాత్రం ఇది కో ఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. కేవలం ఈ ఒక్కటి మాత్రమే కాదు. ఈ సినిమా టైటిల్ లోగో కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ లో ఒక సీజన్ టైటిల్ లోగో లాగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలో కొన్ని షాట్స్ ఒకేలాగా ఉన్నాయి అని అప్పట్లో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.
కానీ ఏదేమైనా సినిమా అన్న తర్వాత ఇలా కొన్ని సీన్స్ మ్యాచ్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు. ఇలాంటివి చాలా సినిమాల్లో, చాలా సందర్భాల్లో జరిగాయి. కానీ ప్రేక్షకులు ఇలాంటివన్నీ పట్టించుకోకుండా కేవలం కథకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు.
కానీ ఇలా పోస్టర్, లేదా ఆ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్పైర్ అయ్యి తీసినవి కొన్ని రోజులు ట్రెండ్ అవుతాయి అంతే. ఇప్పటి వరకు విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్స్, వీడియోస్ లో కొన్ని షాట్స్ ని పోలిన వేరే సినిమా పోస్టర్స్ లేదా షాట్స్ ఏవో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.
watch video :
https://www.youtube.com/watch?v=qdVRXvvDNok&authuser=0
End of Article