RRR “కొమరం భీముడో” పాటని… సీన్-టు-సీన్ కాపీ కొట్టేసారుగా..? ఏ సినిమా నుండి అంటే..?

RRR “కొమరం భీముడో” పాటని… సీన్-టు-సీన్ కాపీ కొట్టేసారుగా..? ఏ సినిమా నుండి అంటే..?

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

rrr trailer analysis and hidden details

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పాటలు సినిమా విడుదల అవ్వకముందే విడుదల అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా కొమరం భీముడో పాట అయితే విడుదల అయిన వెంటనే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. కీరవాణి గారు స్వరపరిచిన ఈ పాటని కాలభైరవ పాడారు. సినిమాలో ఈ పాట చూస్తున్నప్పుడు కూడా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ పాటలోని సీన్స్‌ ఒక ఇంగ్లీష్ సినిమాలోని కొన్ని సీన్స్‌కి దగ్గరగా ఉన్నాయి.

unnoticed details in janani rrr song

ఈ పాటలోని సీన్స్ హాలీవుడ్ సినిమా అయిన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక సినిమాలోని సీన్స్ కొంచెం ఒకే లాగా ఉన్నాయి. ఈ సినిమాకి మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించారు. మెల్ గిబ్సన్ రాజమౌళికి ఇష్టమైన దర్శకులలో ఒకరు. మెల్ గిబ్సన్ సినిమాల్లో ఎమోషన్స్ చూపించే విధానం రాజమౌళికి చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో కూడా అలాగే చూపించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

https://www.instagram.com/reel/Cd8tReKlBnA/

 


End of Article

You may also like