Home Filmy Adda “RRR అప్‌డేట్” వచ్చేసింది.? సినిమా చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా.?

“RRR అప్‌డేట్” వచ్చేసింది.? సినిమా చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా.?

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక విషయాన్ని ఇవాళ బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 29వ తేదీ నాడు ఒక ప్రకటన చేయబోతున్నట్లు సినిమా బృందం తెలిపింది. అలాగే ఆరోజు సినిమాకి సంబంధించి ఒక అప్‌డేట్ కూడా ఉంటుంది అని చెప్పింది. ఎంతో పాపులర్ అయిన పివిఆర్ (PVR) సినిమాస్ తో ఆర్ఆర్ఆర్ చేతులు కలుపబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పష్టత రావాలంటే 29వ తేదీ వరకు ఆగాల్సిందే.

You may also like