ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.rrr movie story

అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ ఒక స్టోరీ సోషల్ మీడియాలో ఒక స్టోరీ వైరల్ అవుతోంది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. 19వ శతాబ్దం మొదలయ్యే సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చనిపోతారు. మళ్లీ తర్వాత పుట్టి 1940లో స్వతంత్రం కోసం పోరాడతారు. స్టోరీ వింటుంటేనే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది కదా? ఇది నిజమో, కాదో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.