Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. పాట చాలా ఎమోషనల్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా, సినిమా బృందం డైరెక్ట్ ప్రమోషన్స్ కంటే ముందే సోషల్ మీడియా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది.
సినిమా అనౌన్స్ చేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుండి, ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకి తమ స్టైల్ లో సమాధానం చెపుతున్నారు టీమ్. అందులో చాలా సమాధానాలు సరదాగా, సెటైరికల్ గా ఉంటాయి. ఇటీవల ఇదే విధంగా ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకి సినిమా బృందం ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక నెటిజెన్, “ఐటెం సాంగ్ ఉందా మావా బ్రో” అని అడిగితే, అందుకు సినిమా బృందం, “ఏ నువ్వు చేస్తావా…” అని రిప్లై ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో సినిమా ప్రమోషన్స్ డిసెంబర్ నుండి మొదలవుతాయి అని, భరతదేశంలో చాలా చోట్ల సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేసామని రాజమౌళి చెప్పారు.
End of Article