Home Filmy Adda “రేయ్.! నువ్ నాకు కనపడకు.!” అన్న నెటిజెన్‌కి… RRR టీమ్ ఇచ్చిన రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!

“రేయ్.! నువ్ నాకు కనపడకు.!” అన్న నెటిజెన్‌కి… RRR టీమ్ ఇచ్చిన రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా బృందం కూడా రిస్క్ తీసుకొని విడుదల చేయలేకపోతున్నారు.

rrr trailer analysis and hidden details

ఇంక పరిస్థితి అర్థం చేసుకున్న అభిమానులు కూడా చేసేదేమి లేక సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మార్చ్ లేదా ఏప్రిల్ లో విడుదల అవుతుంది అని సమాచారం. సినిమా విడుదలకు సమయం ఉన్నా కూడా, సోషల్ మీడియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ టీమ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా తమ స్టైల్ లో సమాధానం చెపుతున్నారు టీమ్.

rrr team reply to a ram charan fan tweet goes viral

అందులో చాలా సమాధానాలు సరదాగా, సెటైరికల్ గా ఉంటాయి. ఇటీవల ఇదే విధంగా ఒక నెటిజెన్ ట్వీట్‌కి సినిమా బృందం ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ట్వీట్‌కి ఒక నెటిజన్ “రేయ్ నువ్ కనపడకు కొన్ని రోజులు నాకు” అని రాసారు. అందుకు ఆర్ఆర్ఆర్ అకౌంట్ నుండి, “అయితే ట్విట్టర్ మానేసి టీవీలో సంక్రాంతి ప్రోగ్రామ్స్ చుస్కో” అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like