“సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు చూడు..!” అన్న కామెంట్‌కి… RRR టీమ్ రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!

“సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు చూడు..!” అన్న కామెంట్‌కి… RRR టీమ్ రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

highlights in rrr movie

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు.  భారతదేశంలో ఉన్న ప్రేక్షకుల నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అందరూ సినిమాని పొగుడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మల్టీస్టారర్ రాలేదు అని అంటున్నారు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది.

rrr team reply to movie upload on youtube

ఇది మాత్రమే కాకుండా రాజమౌళి కూడా మళ్లీ ఒకసారి గొప్ప డైరెక్టర్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు.  సినిమా బృందం సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో షేర్ చేస్తున్నారు. ఈ విషయంపై ఒక నెటిజన్, “ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండటం కాదు అయ్యా.. యూట్యూబ్‌లో ఫుల్ మూవీ అప్‌లోడ్ చేసారు చూడు” అని ట్వీట్ చేసారు. అందుకు సినిమా బృందం, “మేము తీస్తానే ఉన్నాం.. బఫెల్లోస్ (గేదెలు) పెడతానే ఉన్నాయి…” అని రిప్లై ఇచ్చారు.  ప్రస్తుతం సినిమాకి అన్నీ భాషల్లో సూపర్‌హిట్ టాక్ వచ్చింది.


End of Article

You may also like