#RRR టైటిల్ మిస్టరీ ఇదేనా..? ఆర్ ఆర్ ఆర్ అంటే ఏంటి అంటే.?

#RRR టైటిల్ మిస్టరీ ఇదేనా..? ఆర్ ఆర్ ఆర్ అంటే ఏంటి అంటే.?

by Sainath Gopi

Ads

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో మల్టీస్టారర్ మూవీగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గారి సారథ్యంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ టైటిల్ చుట్టూ ఎన్నో ఊహగానాలు అల్లుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలకు తెరదించే విధంగా ఈ చిత్ర రూపకర్త త్వరలోనే చిత్ర టైటిల్ గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కనిపించనున్న సందర్బంగా ఆర్ ఆర్ ఆర్ అంటే రఘుపతి రాఘవ రాజారాం అని ప్రచారం జరుగుతుంది.

Video Advertisement

చిత్రం లోని పాత్రల ప్రకారంగా ఈ టైటిల్ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుంది. వీరితో పాటుగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, బ్యూటీ క్వీన్ అలియా భట్ కూడా కీలక పాత్రలలో నటించనున్నారు. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నేలకొన్నాయి. మరొకవైపు చరణ్ మరియు తారక్ ల ఫస్ట్లుక్ లను మార్చి 27 మే 21 తేదీలలో వారి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

ఈ చిత్రం విడుదల తేదీని 8 జనవరి 2021 కి వాయిదా వేశారు. ఇన్ని అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ చిత్రం యొక్క బడ్జెట్ ను 300 నుండి 400 కోట్ల గా అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జక్కన్న రాజమౌళి గారు ఈ చిత్రం తర్వాత మరొక మల్టీస్టారర్ చిత్రాన్ని కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.


End of Article

You may also like