Ads
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదం అందరిని కలిచి వేసింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ మీదకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మరణించారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుండి గుంటూరు వెళ్ళవలసిన మెట్రో లగ్జరీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగా ప్లాట్ ఫామ్ మీదకి దూసుకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. మరణించిన వారిలో ఒక కండక్టర్, ఒక మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు.
Video Advertisement
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి విచారణ చేస్తున్నారు.ఈ ఘటన పైన ఆర్టీసీ ఎండీ తిరుమలరావు స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు పై మాట్లాడుతూ…
ఆటోనగర్‌కు చెందిన బస్సు గుంటూరు వెళ్లేందుకు 24 మందిని ఎక్కించుకుంది. బస్సు రివర్స్ చేసే క్రమంలో ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లింది. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. బస్సు గేర్ సరిగా పడలేదని చెబుతున్నారు పూర్తి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు.ఆర్టీసీ కార్పొరేషన్ తరపున మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి వైద్యానికి అయ్యే ఖర్చు తామే భరిస్తాం అని తెలిపారు.
బస్సులు కంట్రోల్ స్పీడ్‌లో వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. బస్టాండు సమీప ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం అని తెలిపారు.డ్రైవర్ ఇటీవల సిక్‌లో ఉండి… కోలుకుని విధులకు వచ్చాడు. ఆల్కహాల్ టెస్ట్ చేశాకే డ్రైవర్‌కు బస్సు అప్పగిస్తాం, డ్రైవర్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం కాబట్టే… ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెబుతున్నాం అని అన్నారు. ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నామనేది కరెక్ట్ కాదనీ, బస్సు కండీషన్ కూడా పరిశీలించి రూట్లను నిర్ధారిస్తాం అన్నారు.కచ్చితంగా ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందే అని కారణాలు తెలిశాక చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఈ ఒక్క ఘటనతో ప్రజలు భయపడాల్సిన పనిలేదని తిరుమలరావు విజ్ఞప్తి చేశారు.
Also Read:టీం ఇండియా వరుస విజయాలకు డ్రెస్సింగ్ రూమ్ కారణం అయ్యిందా..? అసలు అక్కడ ఏం జరుగుతోంది..?
End of Article