NUMAISH EXHIBITION 2024: ఈ రూల్స్ పాటించకపోతే… నుమాయిష్ నాంపల్లి ఎక్సిబిషన్ కి నో ఎంట్రీ…!

NUMAISH EXHIBITION 2024: ఈ రూల్స్ పాటించకపోతే… నుమాయిష్ నాంపల్లి ఎక్సిబిషన్ కి నో ఎంట్రీ…!

by Mounika Singaluri

Ads

హైదరాబాద్ పట్టణంలోని నాంపల్లి గ్రౌండ్స్ లో జనవరి ఒకటో తారీఖున నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే పారిశ్రామిక ప్రదర్శన.ఇది 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఇది ప్రతిరోజూ ఉంటుంది. జనవరి 1న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకూ ఇది ఉంటుంది.ఈ ఎగ్జిబిషన్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.

Video Advertisement

ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ సాధారణ రోజుల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10.30 వరకూ ఉంటుంది. అదే వీకెండ్స్, సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 గంటలవరకూ ఉంటుంది. అందువల్ల నుమాయిష్‌కి వెళ్లేవారు ఈ టైమింగ్స్ ప్రకారం వెళ్లడం మంచిది.

గతేడాది నుమాయిష్ ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.40గా ఉండేది. ఈ సంవత్సరం కూడా అదే ఫీజ్ ను ఫిక్స్ చేశారు. టికెట్ ధర పెంచలేదు కాబట్టి ఎగ్జిబిషన్ కి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే…ఈ సంవత్సరం జనవరి 9న లేడీస్ డే నిర్వహిస్తున్నారు. ఆ రోజు మహిళలకు నుమాయిష్‌లో ఫ్రీ ఎంట్రీ ఉంది. అలాగే జనవరి 31న చిల్డ్రన్స్ డే పేరుతో పిల్లలకు నుమాయిష్ ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రెండు రోజుల్లో భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ ఎగ్జిబిషన్ వచ్చే వారి కోసం కొన్ని రూల్స్ ను సూచించారు.రూల్స్ అంటే మరీ కఠినమైన రూల్స్ ఏవీ లేవు గానీ కరోనా వ్యాపిస్తుంది కాబట్టి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పారు. మాస్క్ లేకపోతే ఎంట్రీ లేదని చెప్పారు. ఇక లోపలికి వెళ్లాక సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇక పిల్లల్ని తీసుకువచ్చేవారు ఆ పిల్లల బాధ్యత పూర్తిగా మీరే చూసుకోవాలి.
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 2,400కు పైగా ఎగ్జిబిటర్లు వచ్చారు. వీరిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు. అందువల్ల నుమాయిష్‌కి వచ్చే వారికి ఫుల్ ఫన్ ఉంటుంది. వారు నగలు, తివాచీలు, ఆట బొమ్మలు, టెక్నాలజీ వస్తువులు, కళాత్మక వస్తువులు, ఇలా ఎన్నో రకాల వాటిని ఇక్కడ కొనుక్కోవచ్చు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

అలాగే ఎగ్జిబిషన్ వచ్చే వారికి ఆహారం కోసం ఇబ్బంది లేకుండా ఈసారి మాంసాహార రెస్టారెంట్లతో పాటూ, శాఖాహార రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల శాఖాహారం మాత్రమే తినేవారు, ఆ రెస్టారెంట్లకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈసారి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమల్లో ఉంది కాబట్టి.. ఈ ఎగ్జిబిషన్‌కి మహిళలు భారీ సంఖ్యలో వస్తారనే అంచనా వేస్తున్నారు.

నుమాయిష్ అనేది చాలా పెద్ద ఎగ్జిబిషన్. మొత్తం తిరిగి చూడటానికి 2 గంటలు పడుతుంది. షాపింగ్ చేస్తే 3 గంటలకు పైగా పడుతుంది….కాబట్టి ఎగ్జిబిషన్ కి వెళ్లేవారు సాయంత్రం 4 గంటలకే వెళ్లిపోవడం మంచిది.రెస్టారెంట్లలో స్నాక్స్ తింటూ ఫుల్ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక్కడ వస్తువులు కూడా తక్కువ ధరకు లభిస్తాయి అని అంటున్నారు.


End of Article

You may also like