Ads
కరోనా కారణంగా ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం అందరికి తెలిసిందే. ఫేస్ మాస్క్ వేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ముక్కు, నోరు కవర్ అవ్వడం వల్ల కాలుష్యం ఉన్నాకూడా అది మన వరకు రాదు. అంతేకాకుండా కరోనా వచ్చిన వ్యక్తి అవతల వ్యక్తి తో మాట్లాడితే కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందట. దాంతో ఫేస్ మాస్క్ వేసుకుంటే ప్రమాదాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు.
Video Advertisement
ఫేస్ మాస్క్ ఎక్కువ మందికి అలవాటు ఉండదు కాబట్టి ధరించినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దాంతో చాలామంది ఫేస్ మాస్క్ ధరించడానికి ఎక్కువగా ఇష్టపడట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఫేస్ మాస్క్ ధరిస్తే ఊపిరి ఆడడం ఇబ్బంది అయ్యి, ఆక్సిజన్ ప్రవాహం తగ్గి హైపోక్సియా వస్తుంది అనే పుకార్లు వచ్చాయి.
ఈ పుకార్లను ఆపడానికి ఇటీవల ఒక వైద్యుడు 6 సర్జికల్ మాస్క్లను ధరించాడు. పల్స్ ఆక్సిమీటర్ సహాయంతో ఆక్సిజన్ పరిమాణాన్ని కొలిచాడు. ఆక్సిజన్ లెవెల్ మామూలుగానే ఉన్నట్టు తేలింది. మరొక వైద్యుడు ఫేస్ మాస్క్ వేసుకొని 22 మైళ్ళు పరిగెత్తాడు. ఆక్సిజన్ లెవెల్ 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే సాధారణమైన ఆక్సిజన్ లెవెల్ గా పరిగణించబడుతుంది. పరిగెత్తేటప్పుడు ఆ డాక్టర్ ఆక్సిజన్ లెవెల్ 98 శాతం ఉందట.
ఈ విషయంపై డాక్టర్ టామ్ మాట్లాడుతూ ” చాలామంది మాస్క్ లను ధరించడానికి ఇష్టపడక ఏవేవో కారణాలు వెతుకుతూ ఉంటారు. ఇలాంటి పుకార్ల వల్ల ముఖ్యంగా భయపడేది శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్లు. ఒకవేళ ఫేస్ మాస్క్ ధరిస్తే ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, హైపోక్సియా వచ్చే అవకాశం ఉందేమో అన్న అనుమానాలు వాళ్లలో ఇంకా ఎక్కువగా ఉంటాయి.
ఇంట్లో కూడా పల్స్ ఆక్సిమీటర్ ఉంటే మంచిది. అందులోనూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ల దగ్గర ఉంటే ఇంకా మంచిది. పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్ ఎంతుందో మనమే తెలుసుకోవచ్చు, అప్పుడు ఆక్సిజన్ లెవెల్ ని బట్టి వైద్య సహాయం అవసరమా లేదా అనే విషయంపై ఒక నిర్ణయానికి రావచ్చు” అని అన్నారు.
End of Article