Ads
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టి చెప్పినట్టుగానే మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. డిసెంబర్ 9వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు బస్సులు ఎక్కడ నుండి ఎక్కడ వరకు అయినా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు.
Video Advertisement
ఇందుకోసం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించవలసి ఉంటుంది. అయితే ఈ పథకానికి అపూర్వస్పందన లభిస్తుంది. మహిళలు ఎక్కువ శాతం మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రాధాన్యదిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులు మహిళలతో నిండిపోయి కనిపిస్తున్నాయి.
అయితే ఈ గ్యారెంటీల లోనే ఇంకోటి మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం. ఈ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు అధికారంలోకి వచ్చిన వెంటనే అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే ఈ పథకం కోసం ఈ కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదు అని వదంతం ఇప్పుడు తెలంగాణలో వ్యాపించింది. వెంటనే మహిళలందరూ కూడా ఆధార్ కార్డులతో గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. అయితే సాధారణంగా కేంద్ర ఆయుల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ మహిళలందరూ ఈ కేవైసీ కానీ వారు వెంటనే చేయించుకోవాలని ప్రకటించింది. అయితే ఈ ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఎటువంటి సంబంధం లేదు.
చాలామంది సబ్సిడీ రావాలంటే ఈ కేవైసీ చేయించుకోవాలని ఒక దుష్ప్రచారని చేస్తున్నారు. దీంతో తమకి ఈ కేవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ సిలిండర్ రాదు అనుకుని మహిళలందరూ గ్యాస్ ఏజెన్సీల ముందు భారు తీరుతున్నారు.
ముహీరాబాద్, భవనీ నగర్, సంతోష్ నగర్, మలక్ పేట, టోలిచౌకి, అల్వాల్, సనత్ నగర్ ఇలా పలు ప్రాంతాల్లో జనాలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారుతు తీరారు. ఇకేవైసీ చేసుకోకపోతే సబ్సిడీ కింద సిలిండర్ రాదేమోనని భావించడం ఇందుకు ప్రధాన కారణం.
అంతేకాకుండా మహాలక్ష్మి స్కీం కోసం లబ్ధిదారులను గుర్తిస్తున్నట్లు వదంతలు వచ్చాయి. అయితే గ్యాస్ ఏజెన్సీలు మాత్రం అటువంటిది ఏమీ లేదని కేవలం ఈ కేవైసీ పూర్తికాని వారికి మాత్రమే కేవైసీ చేస్తున్నామని ప్రకటించాయి. తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలని కోరుతున్నాయి.కాగా ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలను గమనిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. సిలిండర్ రేటు దాదాపు రూ. 960 వద్ద ఉంది. ప్రాంతం ప్రాతిపదికన ఈ ధరలో కాస్త అటు ఇటుగా మార్పు ఉండొచ్చు.
End of Article