ఎమెర్జెన్సీ స్టేట్: 20 వేల ట‌న్నుల డీజిల్ లీక్…ఆ నదిని క్లీన్ చేయడానికి 10 ఏళ్ళు పట్టచ్చు.!

ఎమెర్జెన్సీ స్టేట్: 20 వేల ట‌న్నుల డీజిల్ లీక్…ఆ నదిని క్లీన్ చేయడానికి 10 ఏళ్ళు పట్టచ్చు.!

by Megha Varna

Ads

క‌రోనా మ‌హ‌మ్మారితో ప్రపంచం మొత్తం  అల్ల‌క‌ల్లోలం అవుతుంటే ఒక్కో దేశం ఒక్కో రకంగా కొత్త సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది..మొన్నటి వరకు మనకు మిడతల బెడద..ఆ బాధ తెలుగు రాష్ట్రాలకు తీరింది కానీ, దేశాన్ని ఇంకా వదిలిపోలేదు.తాజాగా రష్యాకు పెద్ద విపత్తు వచ్చి పడింది.. ఆయిల్ లీక్ అవడంతో తాగు నీరంతా కలుషితమై ఎమర్జెన్సీ విధించే పరిస్థితి వచ్చింది.

Video Advertisement

ర‌ష్యాలోని నోరిల‌స్క్ సిటీ స‌మీపంలో ఉన్న ప‌వ‌ర్ ప్లాంట్ లో డీజిల్ ట్యాంక్ నుంచి  లీక్ అయిన  దాదాపు 20 వేల ట‌న్నుల డీజిల్ “అంబ‌ర్న‌యా” న‌దిలోకి చేరింది. అయితే ఆ న‌ది నీరు ప్యాసినో స‌ర‌స్సు ద్వారా మ‌రో న‌దిలోకి క‌లిసి, ఆపై ఆర్కిటిక్ స‌ముద్రంలోకి క‌లుస్తుంది. ఆయిల్ వేగం వ్యాపిస్తూ న‌దీ జ‌లాల‌ను మొత్తం క‌లుషితం చేస్తోంది. దాల్దిక‌న్ న‌దిలోకి కూడా ఆయిల్ వ్యాపించింద‌ని రాయిట‌ర్స్ సంస్థ తన కథనాల్లో తెలిపింది.

క్లీనింగ్ కి పదేళ్లు పట్టొచ్చు..

ఈ న‌దులపై ఆధార‌ప‌డే ఆయా ప్రాంతాల్లో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నరు..ఇప్పుడు వారందరి జీవనం ఆగమ్యగోచరం అయ్యే ప్రమాదం ఉంది..ప్రజలతో పాటు ఆ నదుల్లో జీవించే జలచర జీవులు కూడా ఊపిరాడక మరణించే ప్రమాదం కూడా ఉంది.తక్షణమే క్లీనింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించిన ఆ దేశ అద్యక్షుడు పుతిన్, దేశంలో ఎమర్జెన్సీ విధించారు..ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి నదిలోకి వ్యాపించిన, ఇంకా వ్యాపిస్తున్న డీజిల్ ని క్లీన్ చేయడానికి సుమారు పదేళ్ల కాలం పడుతుందని పర్యావరణ నిఫుణులు అంచనా వేస్తున్నారు.దీనికోసం లక్షా 13వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు.

ఆయిల్ లీకేజికి కారణం ఏంటి?

ప్ర‌పంచంలోనే అతి పెద్ద నికెల్, ప‌ల్లాడియం ఉత్ప‌త్తి కంపెనీ నోరిల‌స్క్ నికెల్ కు చెందిన  ప‌వ‌ర్ ప్లాంట్ లో ఉన్న ఆయిల్ ట్యాంక్ పిల్ల‌ర్ కుంగిపోవ‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిట్లు సమాచారం.. ఈ విషయాన్ని ఆ కంపెనీ సిఇవో సెర్గే ప్రకటించారు. అయితే గ‌త శుక్ర‌వారం జరిగిన లీకేజి ఆదివారానికి గానీ అధికారుల‌కు  తెలియలేదు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌ర్ ప్లాంట్ డైరెక్ట‌ర్ వ్యాచెస్ల‌వ్ స్టారోస్టిన్ ను ర‌ష్యా పోలీసులు అరెస్టు చేశారు..


End of Article

You may also like