రష్యా అమ్మాయితో విశాఖ అబ్బాయి పెళ్ళి…. వీళ్ళ ప్రేమ కథ ఏమిటంటే..?

రష్యా అమ్మాయితో విశాఖ అబ్బాయి పెళ్ళి…. వీళ్ళ ప్రేమ కథ ఏమిటంటే..?

by Megha Varna

Ads

ప్రేమకి వయస్సు, కులం, మతం, ప్రాంతం అనే భావన లేదు అని ఈ జంట నిరూపించింది. రష్యా అమ్మాయితో విశాఖ వాసి ప్రేమలో పడ్డాడు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక వీరి ప్రేమ గురించి పూర్తి వివరాలలోకి వెళితే.. రష్యా అమ్మాయితో విశాఖకు చెందిన అబ్బాయి ప్రేమలో పడ్డాడు.

Video Advertisement

ఆమె కూడా అతని ప్రేమకి అంగీకరించింది. తాజాగా ఇద్దరి కుటుంబ సభ్యులుని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని చూస్తే.. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ గ్రామ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ముత్యాల నాయుడు కొడుకు నరేష్, రష్యాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతను అదే ఆఫీసులో పని చేస్తున్నఇరీనా తో ప్రేమలో పడ్డాడు.

ఆమె కూడా అతని ప్రేమకి అంగీకరించింది. ఇరీనా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రేమకి సరే అన్నారు. బుధవారం హిందూ సాంప్రదాయ పద్ధతి లో ఈ జంట వివాహం జరిగింది. ఇరీనా మరియు తన తల్లి ఇద్దరూ కూడా పెళ్లి లో చీరకట్టులో కనిపించటం విశేషంగా మారింది. బుధవారం వేదం మాత్రల సాక్షిగా.. హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేసి ఈ జంట ఒకటయ్యారు. అయితే ఇలా విదేశీ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఎంతో ఆసక్తిగా మారింది.


End of Article

You may also like