Ads
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ చేసిన ఎడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అయ్యింది. తాజాగా మంగళ సూత్రానికి సంబంధించి ఒక యాడ్ ని చిత్రీకరించడం జరిగింది. ఆ యాడ్ లో మోడల్స్ అర్ధ నగ్నంగా కనిపించారు. ఈ యాడ్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
Video Advertisement
ఇది చూసిన నేటిజన్లు మండిపడుతున్నారు. అర్ధ నగ్నంగా మోడల్స్ ని చూపించడం వలన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. అలానే అసలు ఈ యాడ్ మంగళసూత్రం యాడ్ లాగ ఏ మాత్రం లేదని.. లోదుస్తులు లేదా కండోమ్ యాడ్ లాగ ఉందని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అదే విధంగా గే దంపతుల్లో ఒక మగ వ్యక్తి కూడా మంగళసూత్రం ధరించినట్లు తీశారు. దీనిపై కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా హిందూ సమాజ పద్ధతుల్ని టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు నేటిజన్లు. భర్త పట్ల ప్రేమను చూపించే ఒక వస్తువుని కించపరిచారని అన్నారు. గతంలో కూడా సబ్యసాచికి ఇలాంటి కాంట్రవర్సీలు తప్పలేదు. ఇప్పుడు కూడా అదే రీతిలో వస్తున్నాయి.
End of Article