హైదరాబాదులోని నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
బాజార్ ఘాట్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో మంటలు చెల్లారేగడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ లో 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. భవనం కింది భాగంలో గ్యారేజ్ ను నిర్వహిస్తున్నారు.

Video Advertisement

అందులో కెమికల్స్, డీజిల్ ఆయిల్స్, వాహనాలు ఉపయోగించే ఆయిల్స్ నిలువ చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి క్షణాల వ్యవధిలో బిల్డింగ్ అంతా మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అందులో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

అయితే ఆ సమయంలో నిద్ర పోతున్నవారు మంటలో చిక్కుకుని పొగ కారణంగా మృతి చెందారు. ఈ ఘటనలో ఆరు ద్విచక్ర వాహనాలు ఒక కారు కూడా తగలబడిపోయాయి. ఉదయం 9:30 కి ఘటన జరగగా స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.ముందుగా బిల్డింగ్ లో టపాకాయలు  కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు అనుకున్నారు. కానీ మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ సిబ్బంది తెలియజేశారు. లేడర్లు సహాయంతో 16 మందిని కాపాడారు. మరో ఏడుగురు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.చనిపోయిన 9 మంది మృతదేహాలను మార్చురీకి తరలించారు.

watch video:

వాహనాల ఆయిల్ అక్రమంగా నిలవ ఉంచిన కారణంగానే ప్రమాదం జరిగిందని, భవన యజమానిని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దట్టమైన పొగ కారణంగా బయటికి చాలామంది రాలేకపోయారని అన్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తగ్గిందని తెలియజేశారు.భవన యజమాని రమేష్ జైస్వాల్ రసాయన పరిశ్రమను నిర్వహిస్తున్నారు. వివిధ రకాల రసాయనాలను భవన సెల్లార్ లో నిలివవుంచిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Also Read:దివాళిపై ట్రెండ్ అవుతున్న 35 మీమ్స్…నాసా ఫోటో అంటూ వాట్సాప్ అంకూల్స్, దీపాలతో ఫోటోలు అంటూ అమ్మాయిలు.!