Home News కంటతడి పెట్టిస్తున్న సంఘటన.! ప్రేమించిన యువతికి అలా జరగడంతో.?

కంటతడి పెట్టిస్తున్న సంఘటన.! ప్రేమించిన యువతికి అలా జరగడంతో.?

by Mohana Priya

ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరంలో జరిగిన ఓ ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే టీవీ9 కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరం మండలం కరమలవారి పల్లెకి చెందిన లక్ష్మీ నారాయణ రెడ్డి, పార్వతి దంపతుల కుమారుడు మురళీధర్ రెడ్డి. కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మీ నారాయణ రెడ్డి చనిపోయారు. మురళీ సీఏ చదువుకునే సమయంలో ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించారు. వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి వారి పెళ్ళికి ఒప్పించారు.

sad incident at mylavaram

ఇటీవల ఖమ్మం నుండి ఆ యువతి కుటుంబ సభ్యులు వస్తున్నారు అని, పెళ్లికి సంబంధించి వివరాలు మాట్లాడుతారు అని మురళీ తన ఇంట్లో చెప్పారు. ఖమ్మం నుండి ప్రొద్దుటూరుకి చేరుకొని, అక్కడ లాడ్జిలో ఉంటారు అని చెప్పారు. అక్కడి నుండి వారిని తీసుకువస్తాను అని చెప్పి మురళీ ఇంటి నుండి బయలుదేరారు. హోటల్ కి వెళ్లే ముందు మురళీ ఒక లేఖ రాసి పెట్టి వెళ్లారు. ఆ లేఖలో మురళీ ఈ విధంగా పేర్కొన్నారు.

representative image

“అమ్మా నన్ను క్షమించండి. నేను ప్రేమించిన అమ్మాయి ఈనెల 20వ తేదీన అనారోగ్యంతో చనిపోయింది. తను లేని నా జీవితం నేను ఊహించుకోలేను. నేను కూడా చనిపోవాలి అనుకుంటున్నాను.” అని రాశారు మురళీ. ఆ లేఖ చదివిన మురళీ కుటుంబ సభ్యులు హోటల్ కి చేరుకున్నారు. కానీ అప్పటికే మురళీ హోటల్ లో ఒక గదిలో చీరతో ఉరి వేసుకుని చనిపోయారు. మురళీ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మురళీ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like