Home News “తనని చంపుతాను…నేను కూడా చనిపోతాను…” అంటూ మాజీ ప్రియుడి ఘాతుకం.!

“తనని చంపుతాను…నేను కూడా చనిపోతాను…” అంటూ మాజీ ప్రియుడి ఘాతుకం.!

by Mohana Priya

భువనేశ్వర్ లో ఇటీవల జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ప్రియదర్శిని సాహూ అనే ఒక వివాహిత హత్యకు గురయ్యారు. ఆమె కాలేజీలో ఉన్నప్పుడు జగన్నాథ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. తర్వాత విభేదాలు వచ్చి వారిద్దరు విడిపోయారు. 2015 లో ప్రియదర్శిని రాకేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

Sad incident happened in Bhubaneswar

అయితే ఇటీవల జగన్నాథ్ ప్రియదర్శిని ఇంటికి వెళ్లి ఆమెను చంపి తాను కూడా చనిపోవాలని, అలాగే ప్రియదర్శిని మూడు సంవత్సరాల కొడుకుని కూడా చంపేయాలి అని ప్లాన్ వేశాడు. కానీ ఆ బాబు అప్పుడు వేరే వ్యక్తుల దగ్గర ఉన్నాడు. రాకేష్ కూడా ఆఫీస్ లో ఉన్నారు. దాంతో జగన్నాథ్ “నేను చంపుతాను. చేస్తాను” అని ఒక సూసైడ్ నోట్ రాసి, ప్రియదర్శినిని చంపి, తాను తన చేతిని కోసుకున్నాడు.

Sad incident happened in Bhubaneswar

ప్రియదర్శినిని చంపే ముందు జగన్నాథ్, రాకేష్ కి వీడియో కాల్ చేశాడు. కానీ రాకేష్ ఆఫీస్ పనిలో బిజీగా ఉండి ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఆ కోపంలో జగన్నాథ్ ప్రియదర్శిని డెడ్ బాడీ ఫోటోలను రాకేష్ కి పంపాడు. ఆ ఫోటో చూసిన రాకేష్ తన పక్క ఫ్లాట్ లో ఉండే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి అయిన మహారాణా కి కాల్ చేసి తన ఇంటికి వెళ్ళమని కోరగా, ఇంటికి వెళ్లిన మహారాణా ఫ్లాట్ డోర్ లోపల నుండి లాక్ చేసి ఉంది అని మహారాణా పోలీసులకి కాల్ చేశారు.

Sad incident happened in Bhubaneswar

వాళ్ళు వచ్చి తలుపు తీసి చూసినప్పుడు ప్రియదర్శిని చనిపోయి ఉండగా జగన్నాథ్ మృత్యువుతో పోరాడుతూ కనిపించాడు. దాంతో ప్రియదర్శిని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. జగన్నాథ్ ని ఆస్పత్రికి తరలించి, డాక్టర్ల సమక్షంలో జగన్నాథ్ నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు.

Sad incident happened in Bhubaneswar

ప్రియదర్శినిని తను 12 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టు జగన్నాథ్ తెలిపాడు. ఎన్నో సార్లు ఆమె ఇంటికి వెళ్ళాను అని, రాకేష్ కి విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోవాలి అని జగన్నాథ్ కొన్ని సార్లు అడిగాను అని, అయినా సరే ప్రియదర్శిని స్పందించలేదు అని దాంతో చంపడమే సరైన పరిష్కారం అని భావించి అలా చేశాను అని పోలీసులకు తెలిపాడు.

You may also like