Ads
సూర్యాపేట పరిధిలో ఇటీవల జరిగిన ఒక ఘటన చర్యలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, సమయం కథనం ప్రకారం, అనూష అనే 23 సంవత్సరాల యువతి తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అనూషకి ఒక చెల్లెలు కూడా ఉన్నారు. అనూషని తన పెదనాన్న చేరదీశారు. అనూష చెల్లెలిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. వారిద్దరూ అనూష చెల్లెలికి పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు.
Video Advertisement
image source : News 18 Telugu
అనూషని మాత్రం తన పెద్దమ్మ, పెదనాన్న పదో తరగతిలో చదువు ఆపించేసి ఇంటి పనులు, కూలీ పనులు చేయిస్తూ వేధించారు. అనూష బాబాయ్ భార్యకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆమె శిక్షణకు వెళ్ళిన సమయంలో అనూష బాబాయ్ అయిన పగిడిమర్రి విజయ్ కి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దాంతో బాబాయ్ ని చూసుకునేందుకు వెళ్ళమని విజయ్ భార్య అనూషకి చెప్పారు. దాంతో అనూష తన బాబాయ్ ని చూసుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో విజయ్ అనూష ని బెదిరించి అనూషపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దాంతో అనూష గర్భవతి అయ్యారు.
representative image
గర్భవతి అయిన అనూష కి పెద్దమ్మ అబార్షన్ చేయించారు. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని అనూష పెదనాన్న కొడుకు అంజి కూడా లైంగికంగా వేధించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అనూష ఆగస్టు 14వ తేదీ నాడు పురుగుల మందు తాగారు. అనూష ని మొదట మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. తర్వాత పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ కి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం అనూష కన్నుమూశారు. దాంతో అనూష చెల్లెలు, బంధువులే తనను లైంగికంగా వేధించడంతో తన అక్క ఆత్మహత్యకు పాల్పడింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
image source : 10 TV
అనూష మరణం పత్తేపురం గ్రామం మొత్తాన్ని కుదిపేసింది. గ్రామస్తులు అందరూ నేరేడుచర్ల లో ఆందోళనకి దిగారు. పోలీసులు కేసుని తారుమారు చేశారు అని ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. అనూషని వేధించిన విజయ్ ని, అంజి ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనూష మృతికి ఆమె బాబాయ్, పెదనాన్న కొడుకు కారణం అని చెప్పారు. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత అనూషని అయినవారు ఒక పని మనిషిగా చూశారు అని ఆరోపించారు గ్రామస్తులు. ఎంతో సేవ చేసిన అనూషపై తన బాబాయ్ అలా అఘాయిత్యం చేయడం, అలాగే అన్న అనుకున్న వాడే అలాంటి పనులు చేయడం చాలా దారుణం అని అన్నారు.
End of Article