కొందరి ప్రేమ విజయం చెందితే కొందరి ప్రేమ విఫలం అవుతుంది. కొందరికి మధుర జ్ఞాపకాలని ప్రేమ మిగిలిస్తే కొంత మందికి విషాదాన్ని మిగులుస్తుంది ప్రేమ. తాజాగా కర్ణాటకలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడు చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అమ్మాయి కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

Video Advertisement

ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఇది చోటు చేసుకుంది. శృతి అనే అమ్మాయి సెకండరీ పీయూసీ చదువుతోంది. ఆమె బంధువుల కుర్రాడితో మొదట పరిచయం ఏర్పడి.. నెమ్మదిగా అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమలో మునిగిపోయారు. అప్పుడప్పుడు బయటికి కూడా వెళుతుండేవారు.

తర్వాత కొన్నాళ్ళకి ఇంట్లో ప్రేమ గురించి తెలిసింది. వరుసకు వీళ్ళు బావ మరదలు అవడంతో ఇంట్లో వాళ్లు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే ఈ యువకుడు ఊర్లో వ్యవసాయం చేసుకునే వాడు. ఒకరోజు దురదృష్టవశాత్తు కాలుజారి బావి లో పడి చనిపోయాడు.

ఈమె అతనే సర్వస్వం అని అనుకుని బతుకుతోంది. అలాంటిది అతను చనిపోయాడు అంటే ఈమె తట్టుకోలేక పోయింది. హనుమంత చనిపోయి రోజులు గడుస్తున్నా ఈమె మాత్రం ఏడుస్తూ కుమిలిపోయింది. ఇంక ఏం చేయాలో తోచక ఈమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

తల్లిదండ్రులు హనుమంతుని మరచిపోవాలి నీకంటూ ఒక జీవితం ఉందని చెప్పిన సరే ఈమె ఏ మాత్రం మార లేకపోయింది. మనసు మార్చాలని, అతన్ని మరచిపోవాలి మరో సంబంధం కూడా చూసారు. బంధువులు కూడా మరిచిపోవాలని ఈమెకి ఎన్నో విషయాలని చెప్పారు. ఎన్నో ప్రయత్నాలు చేసారు. కానీ ఆమె మాత్రం ప్రేమించిన వ్యక్తిని తప్ప మరెవరినీ భర్త స్థానం లో ఊహించుకోలేను అని భావించి ఉరేసుకుని మరణించింది. ఈ ఘటనతో శృతి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.