తల్లి ఇలా చేయడంతో అర్ధరాత్రి చలిలో రోడ్డుపై పిల్లలు…కంటతడి పెట్టిస్తున్న బాలుడి మాటలు.!

తల్లి ఇలా చేయడంతో అర్ధరాత్రి చలిలో రోడ్డుపై పిల్లలు…కంటతడి పెట్టిస్తున్న బాలుడి మాటలు.!

by Megha Varna

Ads

తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. పైగా ఎలాంటి లోటు లేకుండా వాళ్ళని పెంచుతూ ఉంటారు. కానీ కొందరి పిల్లలకి మాత్రం అంత అదృష్టం ఉండదు. రోడ్డు మీద అనాధల్లా బతకాల్సి వస్తుంది. తిండి లేక.. సరైన బట్టలు లేక.. ఇల్లు లేక అవస్థలు పడుతూ ఉంటారు. అలా ఉన్న ఈ చిన్నారుల గురించి కూడా చూస్తే మీరు కచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు.

Video Advertisement

ఇక వివరాల్లోకి వెళితే… హర్యానాలోని హిస్సార్ లోని చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యుడైన మనోజ్ శర్మ మంగళవారం నాడు ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు సమయం రాత్రి ఒంటి గంట అవుతోంది. చలి ఎక్కువగా ఉందని కారులో హీటర్ కూడా ఆన్ చేశాడు. అయినప్పటికీ కూడా విపరీతంగా చలి వేస్తోంది. ఇంతలో రోడ్డు మీద ఒక పక్క నలుగురు చిన్న పిల్లల్ని చూశారు.

వెంటనే అక్కడ కారు ఆపేసి వాళ్ళని వివరాలు అడిగారు. అక్కడ ఉన్న బాలుడు ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మా నాన్న చనిపోయాడు. మా అమ్మ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మేము రాజస్థాన్ లో వుండే వాళ్ళం. అయితే అమ్మని పెళ్లి చేసుకున్న వ్యక్తి తన బంధువులకు అప్పగించారు. ఆ వ్యక్తి నన్ను రాజస్థాన్ నుండి ఇక్కడకి కి తీసుకు వచ్చేసారు.

ఇక్కడ ఉండి రోజంతా మమ్మల్ని బిచ్చమెత్తుకుని ఉండమన్నాడు. ప్రతి మూడు గంటలకు ఒకసారి వచ్చి అందరు ఇచ్చిన డబ్బులు తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడు. మా ఇంటికి పంపించమని ఎంత ఏడుస్తున్న పంపించడం లేదు. చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ ఇక్కడ ఉన్న నలుగురిని ఒకే వ్యక్తి రాజస్థాన్ నుండి తీసుకువస్తున్నట్లు అనుకుంటున్నారు. మనోజ్ శర్మ పోలీసులకి ఫిర్యాదు చేసి ఈ నలుగురు పిల్లల్ని కూడా వసతి గృహానికి పంపించారు. వీరిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు అని మనోజ్ అన్నారు.


End of Article

You may also like