Home News ఒక కూతురు మరణం నుండి తేరుకోకముందే ఇంకొక విషాదం…15 రోజుల వ్యవధిలో అత్తారిళ్లలో.?

ఒక కూతురు మరణం నుండి తేరుకోకముందే ఇంకొక విషాదం…15 రోజుల వ్యవధిలో అత్తారిళ్లలో.?

by Mohana Priya

కర్ణాటకలో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం కర్ణాటకలోని, హసన్ జిల్లా, సక్లేశ్ పూర్ లోని, బెలగోడు గ్రామానికి చెందిన ఉదయ్ కాఫీ తోటలో కార్మికుడిగా పని చేస్తున్నారు. ఉదయ్ కి నలుగురు కూతుళ్లు. ఉదయ్ పెద్ద కూతురు అయిన సౌందర్య జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Sad incident in Karnataka

తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో పెళ్ళికి నిరాకరించారు. దాంతో ఉదయ్ తన రెండో కూతురు ఐశ్వర్యకి గత సంవత్సరం తుమ్కూర్ జిల్లాలోని కునిగల్ తాలూకాలోని కావేరిపురంలో నివసిస్తున్న నాగరాజుతో వివాహం జరిపించారు. వీరిద్దరూ తుమ్కూర్ లోని సరస్వతి పురంలో నివసిస్తున్నారు. ఉదయ్ మిగతా ఇద్దరు ఆడపిల్లలలో ఒకరు పీయూసీ, మరోకరు ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతున్నారు.

Sad incident in Karnataka

అయితే సౌందర్య ఫేస్ బుక్ లో ఉమేష్ తో పరిచయం పెంచుకున్నారు. ఉమేష్ ని పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో చెప్పారు సౌందర్య. కానీ ఉమేష్ ది వేరే కులం అవ్వడంతో తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. అయినా సౌందర్య ఉమేష్ ని గత సంవత్సరం నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్తతోనే ఉన్నారు. ఈ సంవత్సరం జూన్ 8వ తేదీన ఐశ్వర్య తన భర్త ఇంట్లో వేసుకున్నారు.

Sad incident in Karnataka

అత్తింటివారు కట్నం కోసం వేధించడం వల్లే తన కూతురు చనిపోయారు అని ఐశ్వర్య తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన 15 రోజులకు అంటే జూన్ 25వ తేదీన సౌందర్య తన భర్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఒకే నెలలో ఇద్దరు కూతుళ్లు మరణించడంతో ఉదయ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

You may also like