ఏడాది నుంచి తల్లి మృతదేహంతో ఇంట్లో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు.. చివరికి?

ఏడాది నుంచి తల్లి మృతదేహంతో ఇంట్లో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు.. చివరికి?

by Harika

Ads

ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి శవంతో దాదాపు ఏడాది పాటు ఒకే ఇంట్లో నివసించారు ఒక అక్క చెల్లెలు. వినడానికి కాస్త భయంకరంగా బాధాకరంగా ఉన్న ఈ ఘటన గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం… ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నగరంలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి తన ఇద్దరు కూతుళ్లు పల్లవి 27, వైశ్విక్‌ 17 లతో కలిసి ఒక ఇంట్లో జీవించేవారు. పల్లవి పీజీ పూర్తి చేయగా, వైశ్విక్‌ పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితమే ఉషా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

Video Advertisement

ఆమె చిన్న దుకాణం నడుపుతూ జీవనం సాగించేది. గత ఏడాది డిసెంబరు 8న ఉషా అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయాన్ని అక్కా చెళ్లెలిద్దరూ ఎవరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని కావలసిన వస్తువుల కోసం అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు. మీర్జాపుర్‌లో ఉంటున్న ధర్మేంద్ర కుమార్‌ బుధవారం తన చెల్లి ఉషా త్రిపాఠిని చూసేందుకు వచ్చాడు. ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ధర్మేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం మెరుగు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఒక గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

ఆ ఇద్దరి మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది. అయితే, తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడం కాస్త అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. పల్లవి, వైశ్విక్‌లను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపింది. దాదాపుగా ఏడాది పాటు అక్క చెల్లెలు ఇద్దరు తల్లి మృదేహంతోనే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వారి మానసిక స్థితి బాగోలేదని తెలుసుకున్న వైద్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.


End of Article

You may also like