Ads
కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ఘటన చర్చలకు దారి తీసింది. సమయం కథనం ప్రకారం నగరంలోని మారీక వలసకు చెందిన బొద్దాన రమేష్, వరలక్ష్మి భార్య భర్తలు. వారి కూతురు సింధుకి మూడు సంవత్సరాలు. సింధు కొద్ది రోజుల క్రితం హత్యకు గురయింది. రమేష్ తాపీ మేస్త్రిగా పని చేస్తారు వరలక్ష్మి కోస్టల్ ఫుడ్స్ కంపెనీలో పని చేసేవారు. ఆ క్రమంలో జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తో వరలక్ష్మి కి పరిచయం అయ్యింది.
Video Advertisement
ఆ పరిచయం వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. రమేష్ కి తెలియకుండా వరలక్ష్మి, జగదీష్ కలుస్తూ ఉండేవారు. జగదీష్ కి అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత మార్చ్ 14వ తేదీన వరలక్ష్మి రమేష్ ని వదిలేసి జగదీష్ వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి రాగా, మే 14వ తేదీన జగదీష్ వరలక్ష్మిని, సింధుని మళ్లీ తీసుకువెళ్లారు.
నాలుగు రోజుల క్రితం రమేష్ కి ఫోన్ చేసి సింధు చనిపోయింది అని చెప్పారు వరలక్ష్మి. రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు, వరలక్ష్మిని జగదీష్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో సింధుని మూడు రోజుల క్రితం అర్థరాత్రి శ్మశానంలో పూడ్చిపెట్టినట్టు తెలిసింది. పోలీసులు సింధు మృతదేహాన్ని వెలికితీసి కేజీహెచ్ లో పోస్ట్ మార్టం నిర్వహించారు. సింధుని వరలక్ష్మి చంపారు అని అందరూ అనుకున్నారు.
representative image
కానీ పోలీసుల విచారణలో తేలిన విషయం ఏంటంటే, వరలక్ష్మితో తన సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డు వస్తోందన్న కోపంతో జగదీష్ సింధుని చంపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సింధుని కొట్టి చంపేసిన జగదీష్, వరలక్ష్మి సహాయంతో స్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే సింధుని చంపేసినా కూడా వరలక్ష్మి ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. సింధుని హత్య చేసేందుకు వరలక్ష్మి కూడా సహాయం చేసి ఉంటారు అని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.
End of Article