అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం…మామ మృతితో హుటాహుటిన విజయవాడకు.!

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం…మామ మృతితో హుటాహుటిన విజయవాడకు.!

by Megha Varna

Ads

సంక్రాంతి విన్నర్ అలా వైకుంఠపురం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ స్టార్ కుటుంభంలో పెను విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తల్లి నిర్మల దేవి తరుపున బంధువు ఒకరు హార్ట్ అటాక్ తో విజయవాడలో మృతి చెందారు. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం పాలయ్యాడు.

Video Advertisement

ఇది అల్లు ఫ్యామిలీకి షాకింగ్‌గా మారింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు ఈయన మేనమామ నిర్మాతగా కూడా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఆయన కూడా ఓ నిర్మాతగా ఉన్నారు.చిన్నప్పటి నుంచి కూడా మామతో చాలా సన్నిహితంగా ఉన్నాడు బన్నీ.

ఇప్పుడు ముత్తంశెట్టి ప్రసాద్ మరణవార్త అల్లు కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. విజయవాడలో జనవరి 22న ఈయన కన్నుమూసారు. మరణ వార్త తెలియగానే బన్నీ ఫ్యామిలీ మొత్తం బుధవారం రోజు విజయవాడకు వెళ్లారు.తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందితో ఆయనకీ పరిచయం ఉంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి.


End of Article

You may also like