Ads
కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు. కోట్లాది అడవి జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
Video Advertisement
సుమారు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 10వేల ఒంటెలను చంపేయాలని డిసైడ్ అయ్యింది.కార్చిచ్చు కారణంగా వేడిని భరించలేక ఒంటెలు ఇళ్లలోకి చొరబడి అధికంగా నీటిని తాగేస్తున్నాయి.
ఇళ్లకు వేసిన ఫెన్సింగ్ లను కూడా ధ్వంసం చేస్తూ నీటి వనరులను పాడుచేస్తున్నాయి. అంతేకాదు.. నీళ్ల కోసం ఇళ్లకు అమర్చిన ఏసీలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ప్రజల కనీస అవసరాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ క్రమంలో ప్రజల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఐదు రోజులల్లో దాదాపు 10 వేల ఒంటెలను చంపేందుకు హెలిక్టార్లను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు ఒంటెలను కాల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
End of Article