ఏంటి బావా పెళ్ళంట? సాయి ధరమ్ తేజ్ కు వరుణ్ తేజ్ క్రేజీ రిప్లై.!

ఏంటి బావా పెళ్ళంట? సాయి ధరమ్ తేజ్ కు వరుణ్ తేజ్ క్రేజీ రిప్లై.!

by Megha Varna

మెగా బ్రదర్ నాగ బాబు గారు తమ పిల్లల పెళ్లిళ్లు చేసేస్తే ఓ పని అయిపోతుంది ఇంకా నేను రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు గత కొన్ని రోజులనుండి వార్తలు వైరల్ అవుతున్నాయి.నిహారిక కోసం తగిన వరుడిని వెతికే పనిలో ఉన్నట్లు నాగబాబు అన్నారంట. గతంలో ప్రభాస్ తో నిహారిక పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని కొట్టిపడేసారు నిహారిక. ఇది ఇలా ఉండగా…ఆ వార్తలపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసారు.

Video Advertisement

సాయి తేజ్ ట్విట్టర్ లో “ఏంటి బావా నీకు పెళ్ళంట” అని వరుణ్ తేజ్ గురించి ట్వీట్ చేసారు. దానికి ఇంకా చాలా టైం ఉంది అని వరుణ్ తేజ్ రిప్లై ఇచ్చారు .రానా ,నిఖిల్ బ్యాచిలర్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిపోయారు అని రిప్లై ఇచ్చారు.దానిపై వెన్నెల కిషోర్ స్పందిస్తూ..సింగిల్స్ ఎక్కువుగా ఉపయోగించే మాట ఫరెవర్ సింగల్ కంటే “దానికి ఇంకా టైం ఉంది” అనే రిప్లైని నమ్మచ్చు అని ట్వీట్ చేసారు.

లాక్ డౌన్ కారణంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే లాక్ డౌన్ ఎత్తివేయగానే పెళ్లి చేసుకుందాం అని పెళ్లికాని ప్రసాదులు నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు.అయితే తక్కువ మందిని పెళ్ళికి పిలిచి లాక్ డౌన్ రూల్స్ ను పాటించి కూడా వివాహం చేసుకోవచ్చు.అయితే ఇదే విధంగా టాలీవుడ్ లో దిల్ రాజు,నిఖిల్ వివాహం చేసుకున్నారు.

కాగా సింగిల్స్ అందరూ తమ బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకొనే రానా దగ్గుబాటి కూడా మిహిక బజాజ్ తో తన రిలేషన్ షిప్స్ బయట పెట్టి అందరిని షాక్ కు గురిచేసారు.అయితే రానా మిహిక బజాజ్ త్వరలోనే వివాహం చేసుకున్నరు.అయితే మొన్ననే రోక ఫంక్షన్ చేసుకున్నారు రానా.

 


You may also like

Leave a Comment