నీ హెయిర్ స్టైల్ బాగుందంటూ వరుణ్ తేజ్ సెటైర్… సాయి ధరమ్ తేజ్ కౌంటర్ హైలైట్.!!

నీ హెయిర్ స్టైల్ బాగుందంటూ వరుణ్ తేజ్ సెటైర్… సాయి ధరమ్ తేజ్ కౌంటర్ హైలైట్.!!

by Mohana Priya

Ads

మనం మన స్నేహితుల ఫోటోలు, లేదా మన చుట్టాలు తో కలిసి దిగిన ఫోటోలు, చిన్నప్పటి ఫోటోలు సరదాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాం. కొన్ని ఫోటోలు మరీ ఫన్నీ గా ఉంటే కామెంట్స్ కూడా అలాగే ఫన్నీ గానే వస్తాయి. సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే కాబట్టి. వాళ్లు కూడా అప్పుడప్పుడు ఇలా సరదాగా వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు, లేదా ఎప్పుడూ బయటికి రాని ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు.

Video Advertisement

హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఒక ఫోటో అప్లోడ్ చేశారు. అది వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫోటో. ఆ ఫోటోలో వరుణ్ తేజ్ పక్కన సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. ఫోటో తో పాటు క్యాప్షన్ లో ” నీ హెయిర్ స్టైల్ బాగుంది” అని సాయి ధరమ్ తేజ్ ని ఉద్దేశించి రాశారు వరుణ్ తేజ్.

దానికి సమాధానంగా సాయి ధరమ్ తేజ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో వరుణ్ తేజ్ ఫోటో ఒకటి పోస్ట్ చేసి “నీ గడ్డం కూడా బాగుంది” అని కాప్షన్ లో రాశారు. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సరదాగా చేసిన పోస్ట్ లను చూసిన నెటిజన్లు  ఫోటోలు చాలా ఫన్నీగా ఉన్నాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా మీమ్ పేజెస్ కి ఈ రెండు ఫోటోలు మీమ్ మెటీరియల్ అయ్యాయి. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని మీమ్స్ పోస్ట్ చేశారు.


End of Article

You may also like