చనిపోతూ ఒక అమ్మాయిని కాపాడాడు..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

చనిపోతూ ఒక అమ్మాయిని కాపాడాడు..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

by Mounika Singaluri

Ads

విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర బక్కన్నపాలెం గ్రామానికి చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండడంతో, ఫోటోగ్రాఫర్ గా చేయాలి అని అనుకున్నాడు.

Video Advertisement

సాయి తండ్రి శ్రీను ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా, తల్లి రమణమ్మ ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నారు. అయితే, వారి కొడుకుకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండడంతో, అప్పు చేసి మరీ 15 లక్షలు పెట్టి కెమెరా కొనిచ్చారు. సాయి కూడా ఎంతో కష్టపడి ఫోటోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్నాడు.

sai incident at visakhapatnam

మూడేళ్ల నుండి సొంతంగా ఈవెంట్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉన్నాడు. వాట్సాప్ ద్వారా కూడా ఏదైనా కాంట్రాక్ట్ వస్తే వెళ్లి ఫోటోగ్రఫీ చేసి వచ్చేవాడు. వాట్సాప్ ద్వారానే దూర ప్రాంతాల నుండి ఎవరైనా బుక్ చేసుకున్నా కూడా వెళ్లి ఫోటోగ్రఫీ చేసేవాడు. ఆన్ లైన్ లో గత నెల 24వ తేదీన పోతుల షణ్ముఖ తేజ అనే 19 సంవత్సరాల అబ్బాయి సాయికి పరిచయం అయ్యాడు. షణ్ముఖ తేజ ఒక అమ్మాయికి, తాను కోటీశ్వరుడు అని చెప్పి, తన దగ్గర ఎన్నో లక్షల విలువ చేసే కెమెరా పరికరాలు ఉన్నాయి అని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి ఆ పరికరాలని చూపించమనడంతో, షణ్ముఖ తేజ సాయి కెమెరా దొంగతనం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. షణ్ముఖ తేజ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానానికి చెందినవాడు.

sai incident at visakhapatnam

రావులపాలెంలో ఒక పెళ్లి ఉంది అని, దాన్ని షూట్ చేయడానికి రావాలి అని సాయిని అడిగాడు. తన దగ్గర కెమెరా క్వాలిటీ అంత బాలేకపోవడంతో, సాయి కెమెరా పెద్దది కాబట్టి, మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ వస్తాయి అని, అంతే కాకుండా డబ్బులు కూడా బాగా వస్తాయి అని చెప్పాడు. దాంతో సాయి తన కెమెరా తీసుకొని గత నెల 26వ తేదీన రావులపాలెం వెళ్ళాడు. షణ్ముఖ తేజ, వినోద్ అనే ఒక కార్ డ్రైవర్ ని పిలిచాడు. వినోద్ కడియం మండలం పొట్టిలంకకు చెందినవాడు. సాయికి షూటింగ్ చేసే స్థలానికి కారులో వెళ్దాము అని చెప్పి, ముందు సీట్లో కూర్చోబెట్టారు.

sai incident at visakhapatnam

షూటింగ్ లోకేషన్ కాకున్నా కూడా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో తిప్పి, కడియం మండలం వేమగిరి చేరుకున్నప్పుడు, వెనుక నుండి సీట్ బెల్ట్ తో గొంతు నిలిమి సాయిని షణ్ముఖ తేజ చంపేశాడు. అతని మృతదేహాన్ని గోదావరిలో పూడ్చిపెట్టారు. అయితే, రావులపాలెం పరిసర ప్రాంతంలో తిప్పుతున్నప్పుడు, సాయికి అనుమానం రావడంతో, తన తల్లికి కారు నెంబర్ ఫోటో తీసి పంపించాడు. అంతే కాకుండా షణ్ముఖ తేజ ఫోన్ నెంబర్ కూడా పంపించాడు. గత నెల 29వ తేదీన సాయి తల్లిదండ్రులు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

షణ్ముఖ తేజ రాజమండ్రిలో ఉన్నట్టు గుర్తించి, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కాల్ డేటా పరిశీలించారు. పోలీసులు అతని కాల్ డేటా పరిశీలించడంతో, ఆ అమ్మాయి అక్కయ్య పాలానికి చెందిన అమ్మాయి అని తెలిసింది. ఆమె నుండి షణ్ముఖ తేజతో ఎక్కడ ఉన్నాడు అని మెసేజ్ పెట్టించారు. దాంతో షణ్ముఖ తేజ అన్నవరంలో ఉన్నట్టు చెప్పడంతో పోలీసులు వెళ్లి షణ్ముఖ తేజని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక నిందితుడు వినోద్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే సాయి చనిపోతూ ఒక అమ్మాయిని కాపాడాడు అని అందరూ అంటున్నారు.

watch video : 

ALSO READ : కాసేపట్లో పెళ్లి… అయినా కూడా బాధ్యతని వదలలేదు..! ఈ అమ్మాయి ఏం చేసిందంటే..?


End of Article

You may also like