సాధారణంగా న్యూ ఇయర్ అంటేనే మొదట అందరికీ గుర్తొచ్చేది పార్టీలు. న్యూ ఇయర్ వేడుకలను ఎవరైనా సరే పబ్బులలో కానీ లేదంటే ఏదైనా పార్టీకి వెళ్లి జరుపుకోవడం కానీ చేస్తుంటారు. ముఖ్యంగా నటులు అయితే పెద్ద పెద్ద పార్టీలకి వెళుతూ ఉంటారు. బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కాస్ట్యూమ్స్ ని కూడా ఎక్కువ ధర పెట్టి కొంటూ ఉంటారు. కానీ ఈమె మాత్రం అందరి కంటే డిఫరెంట్ గా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంది.

Video Advertisement

నిజంగా ఈమె చేసిన పని ని మీరు చూస్తే ఫిదా అయిపోతారు. ఇటు తెలుగు అటు తమిళ్ భాషల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న సాయి పల్లవి అందరి నటుల మాదిరి బీచ్లకి పబ్బులకి వెళ్లలేదు.

ఇలా డిఫెరెంట్ గా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంది. దైవ భక్తి లో న్యూ ఇయర్ నాడు మునిగిపోయింది సాయి పల్లవి. సాయి పల్లవి తన కుటుంబ సభ్యుల తో పాటు ఆధ్యాత్మిక సేవ లో ఉన్నారు న్యూ ఇయర్ నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ సాయి పల్లవి ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే… పుట్టపర్తి సాయిబాబా గుడికి వెళ్ళింది.

sai pallavi shocking decision..

సాయి పల్లవి న్యూ ఇయర్ నాడు పుట్టపర్తి  లోనే తన కుటుంబంతో ఉంది. అక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేసింది. అయితే ఎక్కువ డబ్బులు పెట్టి నటులు వాళ్లకి నచ్చినట్లుగా పార్టీలు చేసుకుంటే సాయి పల్లవి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆధ్యాత్మిక సేవలో మునిగి పోయింది. నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఈమె తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి డాన్స్ షోస్ తో అందరినీ ఆకట్టుకుంటూ తను టాలెంట్ ని చూపించింది. ఇలా డాన్సర్ నుండి యాక్టర్ అయిన సాయి పల్లవి ఇప్పుడు అందరిని ఫిదా చేసేస్తోంది.