అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్ధి దారుణ చంపబడ్డాడు. అగ్రరాజ్యంలోని ఓహియోలో షెల్ గ్యాస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరా సాయేశ్ మరణించాడు.
Video Advertisement
వివరాలలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన వీరా సాయేశ్ 2021లో ఎమ్మెస్ చేయడం కోసం అమెరికా వెళ్ళాడు. అతను ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. సాయేశ్ పార్ట్‌టైం జాబ్ కోసం గ్యాస్ స్టేషన్‌లో చేరాడు.
జాబ్ చేస్తూ చదువుకుంటూ, ఇప్పుడిప్పుడే తన ఫ్యామిలికి అండగా ఉంటున్నాడు. అతను ఇపుడు చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. ఇంకో 10 రోజుల్లో సాయేశ్ ఎమ్మెస్ పూర్తి అవబోతుంది. ఈనేపథ్యంలో అతను ఇంటికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ బుధవారం అర్దరాత్రి 12.50 గంటలకు గ్యాస్ స్టేషన్‌లో అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సాయేశ్ పై కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన సాయేశ్ ను సిబ్బంది ఓస్థానిక ఆసుపత్రికి తరలించారు.
సాయేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశాడు. త్వరలోనే ఇంటికి వస్తా అని చెప్పిన సాయేశ్, అంతలోనే కన్నుమూయడంతో ఆ ఫ్యామిలిలో విషాదం నెలకొన్నది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరా సాయేశ్ హెచ్-1బీ వీసాను కూడా తీసుకున్నాడు. అతను అందరితో చాలా కలివిడిగా ఉండేవాడని, ఎవరైనా అడిగితే లేదనకుండా సాయం చేసేవాడని అతని స్నేహితులు వెల్లడించారు. కాగా పోలీసులు కాల్పులు జరిపిన నిందితుల ఫొటోలను విడుదల చేశారు.
అతని స్నేహితులలో ఒకరు మాట్లాడుతూ అంత్యక్రియల కోసం సాయేశ్ మృతదేహాన్ని ఇండియాకి పంపుతున్నామని, దాని కోసం ఆర్ధిక సహాయం అవసరం అని చెప్పారు. డబ్బును సేకరించడం కోసం వారు GoFundMe ని క్రియేట్ చేశారు. వారు మాట్లాడుతూ ”డబ్బు సాయేశ్ ని తిరిగి తీసుకురాదని, కానీ అతని కుటుంబం కోసం మేము చేయగలిగేది ఇదే ” అని తెలిపారు.
Also Read: “నిజామాబాద్” హాస్పిటల్ లో పేషంట్ ని ఈడ్చుకెళ్లడంపై స్పందించిన సూపరింటెండెంట్..! ఏం అన్నారంటే..?