Ads
డిసెంబర్ 22 తారీఖున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. అయితే నార్త్ ఇండియాలో కూడా ప్రభాస్ సినిమా మంచి హైప్ తెచ్చుకుంది. ఈ సినిమాని కూడా భారీ లెవెల్ లో రిలీజ్ చేసేందుకు మీరు మాత్రం ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 21 తారీఖున షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా విడుదలవుతుంది.
Video Advertisement
ఇప్పుడు నార్త్ లో థియేటర్ల విషయంలో సలార్ సినిమాకి చిక్కు వచ్చి పడింది. డంకీ సినిమాని చేస్తున్న పెన్ మూవీస్ వారు నార్త్ ఇండియా లో సింగిల్ స్క్రీన్ లతో అగ్రిమెంట్ చేసుకున్నారట. సింగిల్ స్క్రీన్ లు అన్నిటిలోనూ షారుక్ ఖాన్ డాంకీ సినిమా విడుదల అయ్యేందుకు ప్లాన్ చేశారట. ఈ దెబ్బతో ప్రభాస్ సినిమాకి సింగల్ స్క్రీన్ లు దొరకడం కష్టంగా మారింది. కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే సినిమా విడుదలవుతుంది. ఒకవేళ సింగల్ స్క్రీన్లు దొరకడం కష్టమైతే ఆ ప్రభావం కలెక్షన్స్ పైన చూపిస్తుంది. ఈ లోపు మేకర్స్ ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో వేచి చూడాలి.
End of Article