సలార్ లో ఉన్న పాప రియల్ లైఫ్ లో ఎలా ఉందో తెలుసా..?

సలార్ లో ఉన్న పాప రియల్ లైఫ్ లో ఎలా ఉందో తెలుసా..?

by kavitha

Ads

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ కు ఆడియెన్స్  ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ చిత్రంలో హీరో ప్రభాస్‌ నే కాకుండా, సలార్ లో నటించిన ప్రతీ పాత్రకు ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఉండేలా చూశాడు.

Video Advertisement

అందువల్లే ఈ సినిమాలోని చిన్న క్యారెక్టర్లు చేసినవారు కూడా చాలా పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వారిలో కాటేరమ్మ సీన్‌లో కనిపించిన అమ్మాయి ఒకరు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా, గుర్తుండిపోయేలా నటించి ఆకట్టుకుంది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ సలార్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. వీరిలో ‘కాటేరమ్మ కొడుకును పంపింది’ అంటూ డైలాగ్ చెప్పిన అమ్మాయి కూడా చాలా పాపులర్ అయింది. ఆ అమ్మాయి పేరు ఫర్జానా సయ్యద్. దాంతో పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. ఫర్జానా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఫర్జానా ముస్లిం అమ్మాయి. అయితే సురభి క్యారెక్టర్ ను ఎలా చేశావని అడగగా, ఆమె మాట్లాడుతూ తన తండ్రి ముస్లిం, అని, తల్లి హిందూ అంటూ చెప్పుకొచ్చింది. తన ఇంట్లో పండగలన్ని చేసుకుంటామని చెప్పింది. నటన ముఖ్యమని, దానికి మతంతో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ, మోడల్‌గా ఇప్పటికే పలు యాడ్స్ లో నటించానని, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించానని తెలిపింది. ఆ క్రమంలోనే ‘సలార్’ లో ఛాన్స్ వచ్చిందని ఫర్జానా చెప్పింది.
సురభి క్యారెక్టర్ కోసం ఎంతో మంది ఆడిషన్స్‌కు వచ్చారని, అయితే తను ఎంపిక అవ్వడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు సలార్ మూవీలోని ‘ఫర్జానా’ లుక్ కు, నిజ జీవితంలోని లుక్ కు చాలా ఛేంజ్ ఉందని అంటున్నారు. రియల్ లైఫ్ లో ఆమె చాలా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ట్రెండింగ్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్… ఎందుకో తెలుసా…?


End of Article

You may also like