హైయెస్ట్ డే వన్ గ్రాసర్ గా నిలిచిన ప్రభాస్…. టాప్ 5 లో రెండు సినిమాలు…!

హైయెస్ట్ డే వన్ గ్రాసర్ గా నిలిచిన ప్రభాస్…. టాప్ 5 లో రెండు సినిమాలు…!

by Mounika Singaluri

Ads

నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ సినిమా రికార్డుల వేట మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది.

Video Advertisement

బాహుబలితో ఒక ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్ మళ్ళీ సలాడ్ సినిమాతో తనే బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లోకి వచ్చేసాడు. సలార్ సినిమా డే వన్ గ్రాస్ చూస్తుంటే అందరికీ మతులు పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రోజు ఈ సినిమా 178.7 కోట్ల కలెక్షన్ సాధించింది. ఇప్పటివరకు ఈ రికార్డు సాధించిన మొదటి సినిమాగా నిలిచింది..

ఇక ఈ లిస్టులో ఉన్న టాప్ ఫైవ్ సినిమాలను ఒకసారి పరిశీలిస్తే టాప్ ఫైవ్ ప్లేస్ లో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా ఉంది. ఈ సినిమా డే వన్ 116 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక నాలుగో స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఉంది. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా 129 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక టాప్ మూడో స్థానంలో కూడా ప్రభాస్ సినిమానే ఉంది.

ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా 140 కోట్లు కలెక్షన్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో తమిళ్ హీరో విజయ్ సినిమా లియో ఉంది. ఈ సినిమా డే వన్ కలెక్షన్స్ 148 కోట్లు.
ఈ టాప్ ఫైవ్ లోనే రెండు సినిమాలు ప్రభాస్ వి ఉండటంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మళ్లీ సలార్ రికార్డును ఇప్పట్లో టచ్ చేసే సినిమా రాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు


End of Article

You may also like