Ads
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరో అయినా కూడా తెలుగులో చాలా ఫేమస్ అయిన నటుడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : కిసీ కా భాయ్ కిసీ కి జాన్
- నటీనటులు : సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్.
- నిర్మాత : సల్మాన్ ఖాన్
- దర్శకత్వం : ఫర్హాద్ సామ్జీ
- సంగీతం : హిమేష్ రేష్మియా, రవి బస్రూర్, సుఖ్బీర్ సింగ్, దేవి శ్రీ ప్రసాద్, సాజిద్ ఖాన్, పాయల్ దేవ్, అమల్ మల్లిక్
- విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023
స్టోరీ :
భాయిజాన్ (సల్మాన్ ఖాన్) కి తమ్ముళ్లు ఉంటారు. వాళ్లు పెద్దవాళ్లు అయినా కూడా, భాయిజాన్ కి ఎంత వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోడు. అందుకు కారణం ఏంటి అని ఎవరైనా అడిగితే వచ్చే అమ్మాయి తనకి తన తమ్ములకి మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడగొడుతుంది అని చెప్తాడు. అయితే అతని జీవితంలోకి భాగ్యలక్ష్మి (పూజా హెగ్డే) వస్తుంది.
అనుకోకుండా భాయిజాన్ భాగ్యని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భాగ్య అన్నయ్య గుండమనేని (వెంకటేష్) వారి ప్రేమ అంగీకరిస్తాడా? ఆ తర్వాత భాయిజాన్ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? రౌడీ అన్న (జగపతి బాబు) తో భాయిజాన్ కి ఎందుకు గొడవ అయ్యింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఏదైనా ఒక సినిమా ఒక భాషలో హిట్ అయితే ఆ సినిమాని వేరే భాషల్లో రీమేక్ చేయడం అనేది చాలా సంవత్సరాల నుండి వస్తున్న విషయమే. అలా మన సినిమాలు ఎన్నో వేరే భాషల్లో రీమేక్ అయ్యాయి. వేరే భాషల సినిమాలు ఎన్నో మన భాషలో కూడా రీమేక్ అయ్యాయి. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాని తెలుగులో కాటమరాయుడు పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. ఇప్పుడు ఇదే సినిమాని సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు.
సినిమా కథ అందరికీ తెలిసిన కథే. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఒరిజినల్ స్టోరీ లైన్ మార్చకుండా దానికి కొంచెం బాలీవుడ్ మసాలా యాడ్ చేసి సినిమా తీశారు. అందులోనూ తమిళ్, తెలుగు లో హీరోయిన్ కి నాన్న ఉంటే హిందీలో మాత్రం అన్నయ్య ఉన్నట్టు చూపించారు. అంతే కాకుండా ఈ సినిమాలో కొంచెం తెలుగు వాళ్ళని కూడా తీసుకొని, తెలుగు పాటలు కూడా పెట్టారు. హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు అమ్మాయిలాగానే కనిపిస్తుంది.
తన అన్నయ్యగా వెంకటేష్, వదినగా భూమిక నటించారు. కానీ బాలీవుడ్ వాళ్లకి తెలుగు అయినా తమిళ్ అయినా సరే ఒకటేలాగా ఉంటుంది అనే ఆలోచన ఇప్పటికీ పోలేదు ఏమో అనిపిస్తుంది. బాలీవుడ్ సినిమాల్లో తమిళ్ వాళ్ళని చూపించాలి అంటే లుంగీ, సాంబార్ ఇలాగే చూపిస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పేరుకే తెలుగు వాళ్ళు. కానీ ఆ బొట్టు, వారి వేషధారణ అదంతా తమిళ్ వాళ్ళలాగా అనిపిస్తుంది. తెలుగు సంప్రదాయాన్ని చూపించేటట్టు బతుకమ్మ పాట పెట్టారు. కానీ రామ్ చరణ్ తో వచ్చే పాటలో మళ్లీ లుంగితోనే పాట పెట్టారు.
సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో అంత పెద్ద హీరో. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అన్నగా నటించిన వెంకటేష్ తెలుగులో ఇంకా పెద్ద హీరో. తెలుగు వాళ్ళ సంప్రదాయాన్ని చూపించాలి అని అనుకున్నప్పుడు, అంతే కాకుండా ఇంత పెద్ద హీరో సినిమాలో అలాంటి సాంప్రదాయాన్ని చూపించాలి అన్నప్పుడు సినిమా బృందం ఇంకా కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఒక తెలుగు కుటుంబం ఎలా ఉంటుంది అనే విషయంపై పట్టు వచ్చాక వారి పాత్రలు డిజైన్ చేసి ఉంటే బాగుండేది.
డైలాగ్స్ కూడా వాళ్ళు సీరియస్ గా చెప్తుంటే మనకి కామెడీగా అనిపిస్తాయి. ఉదాహరణకి ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సల్మాన్ ఖాన్ విలన్ అయిన జగపతిబాబుతో ఈ డైలాగ్ చెప్తారు. సల్మాన్ ఖాన్ చెప్పే డైలాగ్ ఈ విధంగా ఉంటుంది. అది ఏంటంటే, “అన్నయ్య నాకు తన ఇంటిపేరు ఇచ్చారు. అన్నయ్య ఇంటిపేరు గుండమనేని. అందులో వచ్చే మొదటి పదం గూండా” అని సల్మాన్ ఖాన్ చెప్తారు. ఇది సినిమాలో చాలా సీరియస్ సీన్ లో వచ్చే డైలాగ్.
ఒక రకంగా హీరో విలన్ కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్. కానీ ఈ డైలాగ్ సినిమాలో చూస్తున్నప్పుడు మాత్రం ఆ వార్నింగ్ లో ఉన్న పవర్ కనిపించదు. ఇది మాత్రమే కాదు. ఈ సినిమాలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఎలివేషన్స్ పేరుతో వాళ్లు చేసే ఫైటింగ్స్ మనం ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చూసాం అనిపిస్తుంది. పాటలు కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. రామ్ చరణ్ వచ్చే ఏంటమ్మా పాట రామ్ చరణ్, వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మాత్రమే బాగుంది. అలాగే బతుకమ్మ పాట కూడా చూడడానికి బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- తెలుగు వాళ్ళు ఉండడం
మైనస్ పాయింట్స్:
- డైలాగ్స్
- కామెడీగా అనిపించే యాక్షన్ సీన్స్
- రొటీన్ కథ
- కొన్ని పాటలు
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా, ఒరిజినల్ సినిమా, తెలుగు రీమేక్ సినిమాతో పోల్చకుండా, సల్మాన్ ఖాన్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి, అలాగే మన తెలుగు హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ ఉన్నారు అని వారి కోసం అయినా సరే సినిమా తప్పకుండా చూడాల్సిందే అనుకున్నవారికి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article