Home Filmy Adda పార్టీలో అందరూ ఉన్నారు…ఒక్క సమంత తప్ప.! కారణమేంటి.?

పార్టీలో అందరూ ఉన్నారు…ఒక్క సమంత తప్ప.! కారణమేంటి.?

by Mohana Priya

Ads

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా నిన్న విడుదలయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది ఇందులో శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, నాగ చైతన్యతో పాటు, నాగార్జున, అఖిల్ అక్కినేని, అలాగే ఈవెంట్ కి అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ ఉన్నారు. కానీ సమంత మాత్రం లేరు. నాగ చైతన్యకి సంబంధించిన పార్టీ అంటే సమంత కచ్చితంగా పాల్గొంటారు.

Video Advertisement

అంతకుముందు వెంకీ మామ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సమంత షేర్ చేసే వారు. ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాకి కేవలం ట్రైలర్ కి స్పందించి సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ ఇందులో కూడా నాగ చైతన్యని మెన్షన్ చేయకపోవడం గమనార్హం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్టర్ పార్టీ జరుగుతున్నప్పుడు సమంత షూటింగ్ కోసం చెన్నైలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.


End of Article

You may also like