సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
Video Advertisement
అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత, ఇటీవల ఫిల్మ్ కంపానియన్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఇందులో సమంతతో పాటు ఈ సంవత్సరం వాళ్ళ నటనతో పేరు తెచ్చుకున్న ఇంకా కొంత మంది యాక్టర్స్ కూడా పాల్గొన్నారు. వారందరినీ “ఈ సంవత్సరం ఎలా ఉంది?” అని అడగగా, వారు ఒకొక్క సమాధానం చెప్పారు. సమంత ఈ ప్రశ్నకి “రఫ్” అని సమాధానం చెప్పారు. ఈ ఆన్సర్ కి అర్ధం ఏంటి అని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.
watch video :